iDreamPost
android-app
ios-app

OTTని షేక్ చేస్తున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

House Of The Dragon Season 2: ఓటీటీల్లో గేమ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ వల్లే ఆ కథ ముగిసిన తర్వాత దానికి ప్రీక్వెల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ప్రీక్వెల్ కి సంబంధించి సీజన్ 2 కూడా రాబోతోంది. ఆ ట్రైలర్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది.

House Of The Dragon Season 2: ఓటీటీల్లో గేమ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ వల్లే ఆ కథ ముగిసిన తర్వాత దానికి ప్రీక్వెల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ప్రీక్వెల్ కి సంబంధించి సీజన్ 2 కూడా రాబోతోంది. ఆ ట్రైలర్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది.

OTTని షేక్ చేస్తున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే టీవీ సిరీస్ కు వరల్డ్ వైడ్ గా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు అమెరికాని ఒక ఊపు ఊపిన టీవీ సిరీస్ ఇది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత కేవలం గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూడటం కోసం నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న ఆడియన్స్ కోట్లలో ఉన్నారు. ఒక విధంగా నెట్ ఫ్లిక్స్ వెయిట్ ని పెంచింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం ఎంతో కష్టం. ఒక ఎపిసోడ్ చూశాక బ్రేకులు వేయాలి అంటే మనసు అసలు ఒప్పుకోదు. అందుకే విదేశాల్లో నైట్ అవుట్ చేసి మరీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూస్తారు. అలాంటి సిరీస్ నుంచి మరో కొత్త సీజన్ రాబోతోంది.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ ముగిసి పోయిన విషయం తెలిసిందే. అయితే ఒక సిరీస్ కి, ఆ కథకి అంత పేరు, ఫ్యాన్డమ్ వచ్చిన తర్వాత మేకర్స్ కచ్చితంగా దానిని కొనసాగించాలనే చూస్తారు. అందులో భాగంగానే ఆగస్ట్ 21, 2022లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ తీసుకొచ్చారు. అదే ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ వెబ్ సిరీస్. ఇది పూర్తిగా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ గా ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ తీసుకొచ్చారు. ఈ కథ కంటే ముందు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని వివరిస్తూ వస్తున్నారు. ఆ 7 రాజ్యాలు, ఆ సింహాసనం, అసలు ఆ సింహాసనం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయి. సొంతవాళ్లే ఎలా కొట్టుకున్నారు. అసలు డ్రాగన్స్ ఎందుకు అంతరించి పోయాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ వస్తున్నారు.

ఇప్పటికే వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయిదే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంత గొప్ప ఆదరణ దక్కలేదు అనే చెప్పాలి. కానీ, ఈ సిరీస్ కి కూడా మంచి అప్లాజ్ లభించింది. అయితే తొలి సీజన్లో కథ ఎక్కువ చెప్పారు. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు రెండో సీజన్లో కథతో పాటుగా.. పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ కనిపిస్తోంది. అలాగే సొంతింటిలోనే గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సింహాసనం, సామ్రాజ్యం కోసం యుద్ధాలు మొదలయ్యాయి. అయిన వాళ్లని కూడా చంపుకోవడానికి సిద్ధపడిపోయారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో రక్త సంబంధానికి కూడా ఎందుకు విలువ లేదు అనేది ఇక్కడి నుంచే మొదలైంది.

HBO ఒరిజినల్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ గా వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాన్ సీజన్ 2కి సంబంధించిన అధికారిక ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ సీజన్ 2 జూన్ 16 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. ప్రస్తుతం సీజన్ 1 జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 2 మాత్రం మ్యాక్స్ లో అందుబాటులో ఉంటుంది. అయితే తర్వాత మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ కి కూడా వస్తుంది. సీజన్ 2 కూడా జియో సినిమాలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişmeritkingjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş