iDreamPost

Gamanam : గమనం రిపోర్ట్

Gamanam : గమనం రిపోర్ట్

నిన్న నాగ శౌర్య లక్ష్యతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. అంతో ఇంతో జనాల దృష్టిలో పడ్డ రెండో చిత్రం గమనం. శ్రేయ ప్రధాన పాత్ర పోషించడం, ఇళయరాజా సంగీతం సమకూర్చడం, ట్రైలర్ లో ఇంటెన్సిటీని చూపించడం లాంటి అంశాలు ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. గత ఏడాది లాక్ డౌన్ టైంలోనే రిలీజ్ కు సిద్ధమైన ఈ డిఫరెంట్ జానర్ మూవీ ఒకపక్క అఖండ ప్రవాహం, మరోపక్క పోటీని తట్టుకుని కేవలం కంటెంట్ ని నమ్ముకుని హాళ్లలో వచ్చింది. అప్పుడెప్పుడో వేదం తర్వాత ఆ తరహా సోషల్ మెసేజ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ గమనం మెప్పించేలా ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

ఇది మూడు కథల సమాహారం. కమల(శ్రేయ)హైదరాబాద్ లోని ఓ ఇరుకు ఇంట్లో అద్దెకు ఉంటూ దుబాయ్ కు వెళ్లిన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇండియన్ క్రికెట్ చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న యువకుడు ఆలీ(రాజ్ కందుకూరి). ఇతన్ని ప్రేమించే అమ్మాయి జరా(ప్రియాంక జవల్కర్)తనను ప్రోత్సహిస్తూ ఉంటుంది. వీళ్ళు కాకుండా మరో ఇద్దరు బిచ్చగాళ్ళు ఇందులో భాగమవుతారు. భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదల వల్ల ఈ ఐదుగురి జీవితాల్లో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటాయి. వరదల్లో చిక్కుకున్న వీళ్ళ జీవితంలో దాని వల్ల ఎదురుకున్న పరిణామాలు, చోటు చేసుకున్న మార్పులు తెరమీదే చూడాలి

దర్శకులు సుజనా రావు తీసుకున్న ప్లాట్ లో విషయం ఉన్నప్పటికీ దానికి సరైన డ్రామా జోడించి ఆసక్తికరంగా మార్చే స్క్రీన్ ప్లేని సరిగా రాసుకోకపోవడంతో గమనం చాలా డల్ గా సాగుతుంది. ఎమోషనల్ గా హెవీగా ఉండాల్సిన ఈ మూవీ ఈ విషయంలోనే తడబడిపోవడంతో కనెక్టివిటీ మిస్ అయ్యింది. సంగీత దిగ్గజం ఇళయరాజా కూడా నిస్సహాయంగా మిగిలిపోయారు. రెండు పాటలు మినహాయించి బ్యాక్ స్కోర్ తో సహా ఏదీ ఆయన స్థాయిలో లేదు. చారుహాసన్ సహా ఆర్టిస్టులందరూ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ టేకింగ్ లోపాల వల్ల వాళ్ళ కష్టం వృధా అయ్యింది. ఓటిటి ఛాయస్ గా ఉండాల్సిన సినిమాను థియేటర్లకు ఇచ్చారు

Also Read : Anudeep : జాతిరత్నాలు డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్ ఇదేనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి