iDreamPost

Sitara : వంశీ చెక్కిన అందమైన శిల్పం

అప్పుడే తను అసిస్టెంట్ గా ఎన్నో చిత్రాలకు పని చేసిన పూర్ణోదయా సంస్థ నుంచి వంశీకి ఆఫర్ వచ్చింది. మంచి కథను సిద్ధం చేసుకోమని చెప్పారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. అప్పటికే తనే రాసి నవల రూపంలో సూపర్ హిట్ అయిన 'మహల్లో కోకిల'నే సినిమాగా తీస్తే బాగుంటుందన్న ఆలోచన వంశీది. అదే ఆయనకు చెప్పారు. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ప్రాణం పెట్టి తీయాలని వంశీ డిసైడ్ అయిపోయారు.

అప్పుడే తను అసిస్టెంట్ గా ఎన్నో చిత్రాలకు పని చేసిన పూర్ణోదయా సంస్థ నుంచి వంశీకి ఆఫర్ వచ్చింది. మంచి కథను సిద్ధం చేసుకోమని చెప్పారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. అప్పటికే తనే రాసి నవల రూపంలో సూపర్ హిట్ అయిన 'మహల్లో కోకిల'నే సినిమాగా తీస్తే బాగుంటుందన్న ఆలోచన వంశీది. అదే ఆయనకు చెప్పారు. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ప్రాణం పెట్టి తీయాలని వంశీ డిసైడ్ అయిపోయారు.

Sitara : వంశీ చెక్కిన అందమైన శిల్పం

1983 సంవత్సరం. ‘మంచుపల్లకి’తో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వంశీకి ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది కానీ కమర్షియల్ గా మరీ గొప్ప స్థాయికి వెళ్లలేకపోయింది. సున్నితమైన కథాంశాన్ని నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయితో చేసిన స్నేహం గురించి తీసిన తీరు విమర్శకులను మెప్పించింది. అప్పుడే తను అసిస్టెంట్ గా ఎన్నో చిత్రాలకు పని చేసిన పూర్ణోదయా సంస్థ నుంచి వంశీకి ఆఫర్ వచ్చింది. మంచి కథను సిద్ధం చేసుకోమని చెప్పారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. అప్పటికే తనే రాసి నవల రూపంలో సూపర్ హిట్ అయిన ‘మహల్లో కోకిల’నే సినిమాగా తీస్తే బాగుంటుందన్న ఆలోచన వంశీది. అదే ఆయనకు చెప్పారు. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ప్రాణం పెట్టి తీయాలని వంశీ డిసైడ్ అయిపోయారు. దానికి తగ్గట్టే టీమ్ ని సెట్ చేసుకునే పనిలో పడ్డారు. రాజీ వద్దు అనే హామీ వచ్చింది.

జంధ్యాల గారి వద్ద పని చేసిన అనుభవం ఉన్న సాయినాథ్ తోటపల్లిని మాటల రచయితగా తీసుకున్నారు. ఇళయరాజా సంగీతమనగానే వంశీ కాళ్ళు భూమి మీద లేవు. అద్భుతమైన కలయికకు శ్రీకారం చుట్టింది ఈ సితారతోనే. హీరోగా సుమన్, కీలకమైన జమీందార్ పాత్రకు శరత్ బాబు ఎంపికయ్యారు. అసలైన హీరోయిన్ ఇంకా సెట్ కాలేదు. భారతీరాజా తీసిన ‘మెల్ల పేసుంగల్’లో నటించిన భానుప్రియ వంశీకి నచ్చేసింది. కాస్త నల్లగా ఉన్నా మొహంలో విపరీతమైన కళతో పాటు కళ్ళతో అభినయం చేసే సత్తాని గుర్తుపట్టారు. నాట్యంలో ప్రవేశం ఉందని తెలిశాక ఇక ఆలోచించలేదు. శుభలేఖ సుధాకర్, ఏడిద శ్రీరామ్, జెవి సోమయాజులు, ప్రభాకర్ రెడ్డి, సాక్షి రంగారావు, రాళ్ళపల్లి తదితరులను ఇతర తారాగణంగా తీసుకున్నారు. ఎంవి రఘుకి ఛాయాగ్రహణం అప్పగించారు.

బడ్జెట్ బరువు లేకుండా సినిమా మొత్తాన్ని గోదావరి పరిసర ప్రాంతాల గ్రామాల్లో తీశారు వంశీ. వెంకటగిరి కోట బాగా ఉపయోగపడింది. సిటీ సీన్స్ కోసం మద్రాసు వెళ్లారు. అనుకున్న టైంలో చిత్రీకరణ పూర్తయ్యింది. పెద్ద వంశ చరిత్ర కలిగిన ఓ అమ్మాయి జనజీవన స్రవంతిలోకి వచ్చి సినిమా హీరోయిన్ అయ్యాక ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే పాయింట్ తో వంశీ తీసిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. రీ రికార్డింగ్ కాకముందు కాపీ చూసిన చాలా మంది నిర్మాతతో ఇది పోయిందనే చెప్పారు. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దాక ఎవరికీ నోట మాట రాలేదు. 1984 ఏప్రిల్ 26 సితార తక్కువ ప్రింట్లతో రిలీజయ్యింది. 27న కృష్ణ ‘ముఖ్యమంత్రి’ పోటీగా వచ్చింది. సితార మొదటి వారం స్లోగా ఉన్నా తర్వాత పికప్ అయిపోయి ఏకంగా పదకొండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. జాతీయ స్థాయిలో మూడు అవార్డులు దక్కించుకుంది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది

Also Read : Gandeevam : అక్కినేనితో బాలయ్య ఫలితం రాలేదయ్యా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి