iDreamPost

Kirathakudu : కిల్ చేసిన కిరాతకుడు

డిస్ట్రిబ్యూషన్ రంగంలో బాగా పేరున్న లక్ష్మి ఫిలింస్ డివిజన్ తమ మొదటి ప్రయత్నంగా సూపర్ స్టార్ కృష్ణతో నిర్మించిన వజ్రాయుధం సూపర్ హిట్ అయ్యింది. రెండోది కూడా అదే తరహాలో స్టార్ హీరోతో చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

డిస్ట్రిబ్యూషన్ రంగంలో బాగా పేరున్న లక్ష్మి ఫిలింస్ డివిజన్ తమ మొదటి ప్రయత్నంగా సూపర్ స్టార్ కృష్ణతో నిర్మించిన వజ్రాయుధం సూపర్ హిట్ అయ్యింది. రెండోది కూడా అదే తరహాలో స్టార్ హీరోతో చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

Kirathakudu : కిల్ చేసిన కిరాతకుడు

ఇప్పుడంటే పోకిరి, ఇడియట్ లాంటి నెగటివ్ టైటిల్స్ ఒక ట్రెండ్ గా మారిపోయి హీరోయిజంకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాయి కానీ ఒకప్పుడు వీటికి శ్రీకారం చుట్టింది చిరంజీవే. దొంగ, గూండా, రాక్షసుడు లాంటి పేర్లు జనంలోకి బాగా వెళ్లడమే కాదు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కూడా అందించాయి. కానీ ప్రతిసారి అలాంటి ఫలితాలు అందుకోలేవుగా. కథాకథనాలు చాలా ముఖ్యం. ఓ ఉదాహరణ చూద్దాం. 1986. ఇంకా మెగాస్టార్ బిరుదు రాలేదు కానీ చిరు మంచి ఫామ్ లో ఉన్న సమయం. అడవిదొంగ లాంటి మాస్ ఎంటర్ టైనర్స్, విజేత లాంటి ఫ్యామిలీ మూవీస్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన కాల్ షీట్స్ ఇస్తే కనకవర్షం గ్యారెంటీ అనే నమ్మకం.

డిస్ట్రిబ్యూషన్ రంగంలో బాగా పేరున్న లక్ష్మి ఫిలింస్ డివిజన్ తమ మొదటి ప్రయత్నంగా సూపర్ స్టార్ కృష్ణతో నిర్మించిన వజ్రాయుధం సూపర్ హిట్ అయ్యింది. రెండోది కూడా అదే తరహాలో స్టార్ హీరోతో చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు రచయిత సత్యమూర్తి ఇచ్చిన కథే ఈ కిరాతకుడు. కళ్లెదుటే ఉన్నా తండ్రి ప్రేమకు నోచుకోక తన లోకం తనదే అని తిరిగే ఒక యువకుడు ప్రమాదకరమైన దుర్మార్గుల చేతిలో జన్మనిచ్చినవాడు బందీగా మారితే ఎలా విడిపించుకువచ్చాడు అనేదే ఇందులో మెయిన్ పాయింట్. అభిలాష ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్స్ తో తిరుగులేని కాంబినేషన్ గా జతకూడిన ఏ కోదండరామిరెడ్డి దర్శకుడిగా ఎంపికయ్యారు.

ఇందులో మొదటిసారి తన కొడుకు చరణ్ పేరుని క్యారెక్టర్ కోసం పెట్టుకున్నారు చిరంజీవి. ఇదీ దర్శక నిర్మాతలు రికమండేషనే. ఇళయరాజా సంగీతం సమకూర్చగా సుహాసిని హీరోయిన్ గా చేశారు. దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి విలన్ కన్నడ ప్రభాకర్ పక్కన గ్యాంగ్ లో ఒక విచిత్రమైన పాత్రలో కనిపిస్తారు. కొంత నెగటివ్ టచ్ తో డల్ గా కనిపించిన చిరంజీవిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. దానికి తోడు కొన్ని యాక్షన్ సీన్స్ ని ఖర్చు పెట్టి తీయలేక హాలీవుడ్ సినిమాల నుంచి యథావిధిగా ఎత్తుకొచ్చి పెట్టేయడంతో జనం గుర్తుపట్టారు. 1986 జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన కిరాతకుడు అంచనాలు అందుకోలేకపోయింది. కాకపోతే చిరంజీవి స్టైలిష్ యాక్షన్, పాటలు కొంత ఊరట కలిగించాయి. తక్కువ గ్యాప్ తో వచ్చిన కృష్ణగారడీ, శ్రావణసంధ్య మంచి విజయం సాధించాయి

Also Read : Lakshmi Durga : చిన్నా పెద్దా అలరించిన లక్ష్మిదుర్గ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి