iDreamPost

RRR Promotions : అంచనాలకు అందని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్

RRR Promotions : అంచనాలకు అందని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్

సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతోంది. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 19న ముంబై వేదికగా 3 వేల అభిమానులతో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున చెరి పదిహేను వందల మందిని ట్రైన్లలో తీసుకువెళ్తున్నట్టు సమాచారం. దీనికోసం ఇప్పటికే ఆయా అభిమాన సంఘాలతో సమన్వయం చేసుకుంటూ రాజమౌళి బృందం పక్కాగా దీన్ని అమలు చేయబోతోందట. వేడుకకు సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఈ రోజో రేపో చెప్పేస్తారు.

దీనికి సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా రావడం కన్ఫర్మ్ అయినట్టే. రాజమౌళి బ్రాండ్, చరణ్ ఫ్యామిలీతో కండల వీరుడికి ఉన్న అనుబంధం, గాడ్ ఫాదర్ లో క్యామియో చేసేందుకు ఒప్పుకోవడం లాంటి కారణాలు దీనికి దోహదపడ్డాయి. స్పెషల్ గెస్టులు ఇంకా వేరే ఉంటారట. పేర్లు గోప్యంగా ఉంచారు. ఆర్ఆర్ఆర్ ని నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా మార్చేందుకు జక్కన్న ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమలులోనే ఉన్నాయి. మరి ఇంత పెద్ద సమూహం అంటే అనుమతులు వగైరా ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలియాల్సి ఉంది. తెలుగు స్టార్స్ ఎవరైనా హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్.

రేపు పుష్ప విడుదలయ్యాక ఆర్ఆర్ఆర్ స్పీడ్ ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చే అతి పెద్ద పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ కనక అంచనాలను ఇంకా పైకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. హైదరాబాద్ లో ఎప్పుడు చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. చెన్నై కర్ణాటకలో కూడా ఈవెంట్స్ ఉంటాయి. చరణ్ తారక్ ఇద్దరూ కేవలం వీటి కోసమే వారాల పాటు తమ డైరీని ఖాళీగా ఉంచుకున్నారు. ఎక్కడికి ఎప్పుడు రమ్మన్నా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వంద మిలియన్ల వ్యూస్ దాటేసిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ తర్వాత మరో వెర్షన్ కట్ చేసే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. రాబోయే రోజుల్లో కంటిన్యూ అప్డేట్స్ ఉండబోతున్నాయి

Also Read : Unstoppable With NBK : పక్కా ప్లానింగ్ తో సెలబ్రిటీ టాక్ షో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి