iDreamPost
android-app
ios-app

ఆ క్యారెక్టర్ కి ఎన్టీఆర్ ఒక్కడే న్యాయం చేయగలడు: ‘గదర్ 2’ డైరెక్టర్

  • Author Soma Sekhar Published - 11:15 AM, Mon - 4 September 23
  • Author Soma Sekhar Published - 11:15 AM, Mon - 4 September 23
ఆ క్యారెక్టర్ కి ఎన్టీఆర్ ఒక్కడే న్యాయం చేయగలడు: ‘గదర్ 2’ డైరెక్టర్

చిత్ర సీమలో కొన్ని కొన్ని పాత్రలు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతాయి. ఆ పాత్రలు వారుతప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నంతగా అందులో జీవిస్తారు. ఇక ఇంకొన్ని పాత్రలు అయితే ఫలానా హీరోకి అదిరిపోయేదే అని అభిమానులు చెబుతుంటారు. డైరెక్టర్లు సైతం ఫలానా సినిమాలో క్యారెక్టర్ ను ఆ హీరోని ఊహించుకుని రాసుకున్నాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ శర్మ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుస హిట్లు లేక అల్లాడిపోతున్న బాలీవుడ్ కు ‘గదర్ 2’ సినిమాతో ప్రాణం పోశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో సన్నీడియోల్ పోషించిన తారాసింగ్ పాత్ర ప్రస్తుతం ఏ హీరోకి సరిపోతుందో చెప్పాడు అనిల్ శర్మ.

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘గదర్ 2’. ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించగా.. థియేటర్ల దగ్గర కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. 2001లో వచ్చిన ‘గదర్’ మూవీకి సీక్వెల్ గా వచ్చి బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ.. రూ. 500 కోట్ల మార్క్ ను అందుకునేందుకు పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమాలో తారాసింగ్ గా సన్నీ డియోల్ తన విశ్వరూపం చూపాడు. తారాసింగ్ పాత్రలో సన్నీ డియోల్ ను తప్ప మరెవరిని ఊహించుకోలేరు అన్నంతగా ఆ పాత్రలో జీవించేశాడు.

ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు అనిల్ శర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ ‘గదర్:ఏక్ ప్రేమ్ కథ’ సినిమాను మళ్లీ తీస్తే తారాసింగ్ పాత్రకు ఎవరిని తీసుకుంటారు అని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి సమాధానంగా అనిల్ శర్మ మాట్లాడుతూ..” ప్రస్తుత తరంలో తారాసింగ్ పాత్రకు న్యాయం చేయగలిగే ఒకే ఒక్క యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అతడు ఒక్కడే ఆ పాత్రకు న్యాయం చేయగలడు. బాలీవుడ్ లో నాకు ఏ హీరో తారాసింగ్ పాత్ర చేయగలరు అని అనిపించడం లేదు. ఒక్క ఎన్టీఆర్ కే ఈ పాత్ర సరిపోతుంది” అని అనిల్ శర్మ చెప్పుకొచ్చాడు.

కాగా.. ఎన్టీఆర్ పై డైరెక్టర్ అనిల్ శర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. నటనలో తమ హీరోని కొట్టేవారే లేని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తుండగా.. జాన్వీకపూర్ యంగ్ టైగర్ కు జోడీగా నటిస్తోంది. మరి ఎన్టీఆర్ ఒక్కడే తారాసింగ్ పాత్రకు న్యాయం చేయగలడు అన్న అనిల్ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss