iDreamPost
android-app
ios-app

తెరపై చూసింది వేరు- నిజమైన షకీలా వేరు.. ఎంతో మందికి అమ్మగా..!

తెరపై చూసింది వేరు- నిజమైన షకీలా వేరు.. ఎంతో మందికి అమ్మగా..!

షకీలా.. సౌత్ సినిమాలో ఈ పేరు ఒక బ్రాండ్. బడా బడా స్టార్ హీరోలు కూడా ఆమె సినిమా వస్తోంది అంటే సైడ్ ఇచ్చేయాల్సిందే. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్లు కూడా షకీలా సినిమా వస్తోందని వాళ్ల మూవీస్ పోస్ట్ పోన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. శృంగార తారగా ఎవరికీ దక్కని గుర్తింపు సంపాదించుకున్న షకీలా.. తర్వాత అదే గుర్తింపు వల్ల తన జీవితం తారుమారు అయింది. దాదాపు కనుమరుగు అయిపోయింది అనుకున్న తరుణంలో బిగ్ బాస్ రూపంలో షకీలాకు ఒక మంచి ప్లాట్ ఫామ్ దొరికినట్లు అయింది.

బిగ్ బాస్ 7 హౌస్ లో ఉన్న సభ్యుల్లో అత్యధిక క్రేజ్, నెగిటివ్ వ్యూస్ ఉన్న ఏకైక స్టార్ షీకీలానే కావచ్చు. బీ గ్రేడ్ సినిమాల్లో యాక్ట్ చేయడం కారణంగా ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త దూరంగా ఉంటారు. ఇప్పుడు ఆ పేరును చెరిపేసుకోవడానికే షకీలా ఈ షోకి వచ్చినట్లు చెప్పింది. తన ఏవీలో తన కష్టాలు, తన జీవితం గురించి చెప్తూ షకీలా ఎంతో ఎమోషనల్ అయింది. నా అనుకున్న వాళ్లే తన జీవితం ఇలా అయ్యేలా చేశారంటూ వాపోయింది. రోజుల లెక్క రెమ్యూనరేషన్ తీసుకున్న రోజుల్లో షకీలా గంటల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంది. సినిమాలపై సినిమాలు చేస్తోంది. కానీ, ఆమె చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది.

తన తల్లికి మాయ మాటలు చెప్పి తన అక్కే మొత్తం డబ్బు తీసుకున్నట్లు షకీలా చెప్పుకొచ్చింది. ఇప్పుడు వాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారని.. తాను మాత్రం ఇలా అయిపోయినట్లు చెప్పింది. తన కెరీర్ స్టార్టింగ్ లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను కూడా షకీలా ఆడియన్స్ తో పంచుకుంది. తన తండ్రి తన విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే తన లైఫ్ ఇంకాస్త బెటర్ గా ఉండేదని చెప్పింది. సీన్ కోసం బట్టలు విప్పమని చెప్తున్నారని చెబితే.. నచ్చితే చెయ్ లేదంటే వదిలేయ్ అని చాలా ఈజీగా చెప్పేవారని తెలిపింది. తన తండ్రి మరణం తర్వాతే తాను బీ గ్రేడ్ సినిమాల్లో చేశానంది. అయితే అందరికీ తెలిసిన షకీలా వేరు.

నిజానికి రియల్ లైఫ్ లో ఉండే షకీలా వేరు. చాలా మంది ఆమె పేరు వినగానే ఛీ అనుకుంటారు. కానీ, నిజ జీవితంలో ఆమె ఎంతో మందికి అమ్మ అయ్యింది. తనని అందరూ ప్రేమగా షకీలా అమ్మ అని పిలుస్తారు. ఇల్లు, అమ్మ అనే పిలుపుకి దూరమైన ఎంతో మంది ట్రాన్స్ జెండర్స్ కి షకీలా అమ్మగా మారింది. వాళ్లందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉంది. తాను చనిపోతే తనకి ఎవరూ లేరనే బాధ లేదని షకీలా వెల్లడించింది. ఎందుకంటే తనకంటూ ఎంతో మంది పిల్లలు ఉన్నారంటూ షకీలా ఎమోషనల్ అయింది. తనపై ఉండే అభిప్రాయం, తన పేరును మార్చుకోవాలనే బిగ్ బాస్ కి వచ్చినట్లు షకీలా తెలియజేసింది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusu