iDreamPost
android-app
ios-app

భారీ ఈవెంట్‌లో గామి ట్రైలర్ రిలీజ్

  • Published Feb 26, 2024 | 5:10 PM Updated Updated Feb 26, 2024 | 5:10 PM

విశ్వక్ సేన్ సరికొత్త లుక్ లో దర్శనమిస్తోన్నచిత్రం గామి. ఇప్పటికే విడుదలైన టీజర్, మేకింగ్ వీడియోలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది.

విశ్వక్ సేన్ సరికొత్త లుక్ లో దర్శనమిస్తోన్నచిత్రం గామి. ఇప్పటికే విడుదలైన టీజర్, మేకింగ్ వీడియోలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది.

  • Published Feb 26, 2024 | 5:10 PMUpdated Feb 26, 2024 | 5:10 PM
భారీ ఈవెంట్‌లో గామి ట్రైలర్ రిలీజ్

మాస్ కా దాస్ గా పిలవబడుతూ యువ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రథాన పాత్రలో నూతన దర్శకుడు విద్యాధర్ కాగితా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గామి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. 2024 మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్, మేకింగ్ వీడియోతో పాటు ఇటీవల విడుదలైన పాట కూడా సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తోంది.

ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని పంచేందుకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పీసీఎక్స్ స్క్రీన్ పై గామి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఫిబ్రవరి 29, 2024 సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అంటే ప్రేక్షకులకు ఫేవరెట్ థియేటర్… అందులోనూ పీసీఎక్స్ స్క్రీన్ అంటే టికెట్ల కోసం ఎంతో డిమాండ్ ఉంటుంది. అలాంటి స్క్రీన్ లో గామి ట్రైలర్ విడుదలైతే ఖచ్చితంగా సినిమాలోని టెక్నికల్ ఎలిమెంట్స్ ఎంత బలంగా ఉన్నాయో ప్రేక్షకులకి తెలుస్తుంది. విలక్షణమైన కథాంశంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు గామి సిద్ధంగా ఉందని చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉంది.

అఘోరా పాత్రలో నటిస్తోన్న విశ్వక్‌ సేన్‌ తన సమస్యకు పరిష్కారం వెతుకుతూ హిమాలయాలకు చేసే ప్రయాణమే ఈ గామి అని టీజర్‌ ద్వారా తెలిసింది. ఇక ట్రైలర్ లో సినిమా కథ గురించి మరింత సమాచారం దొరుకుతుంది. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఈ సినిమాను తెరకెక్కించారు. విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి నటించగా, ఎం.జి.అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెదాడ కీలక పాత్రలు పోషించారు. మరి గామి ట్రైలర్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet