తాజాగా ఓ బౌలర్ వెరైటీ బౌలింగ్ వేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ బౌలింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఓ బౌలర్ వెరైటీ బౌలింగ్ వేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ బౌలింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాధరణంగా కొన్ని క్రికెట్ మ్యాచ్ ల్లో జరిగే సంఘటనలు చూస్తే.. మనం నవ్వాపుకోలేం. కొన్ని సార్లు ప్లేయర్లు చేసే వెరైటీ చేష్టలు కడుపుబ్బా నవ్విస్తాయి. గతంలోనూ ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక క్రికెట్ లో వైవిధ్యమైన బౌలింగ్ వేసే ప్లేయర్లను మనం ఎంతో మందిని చూశాం. మలింగ, కుల్దీప్ యాదవ్ లతో పాటు ఎంతో బౌలర్లు ఉన్నారు. ఇక సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గర నుంచి క్రికెట్ లో జరిగే ప్రతీ చిన్న సన్నివేశాలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ బౌలర్ వెరైటీ బౌలింగ్ వేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ బౌలింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
క్రికెట్ మ్యాచ్ ల్లో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు ప్రేక్షకులకు విపరీతంగా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఇక కొందరు బౌలర్లు తమ బౌలింగ్ యాక్షన్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటారు. తాజాగా తన విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ తో నెట్టింట వైరల్ గా మారాడు ఓ ఆటగాడు. ఈ మ్యాచ్ కు సంబంధించిన వివరాలు తెలీదు కానీ.. ఈ వీడియో మాత్రం కడుపుబ్బా నవ్విస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే? బ్యాట్స్ మెన్ బంతిని కొట్టేందుకు క్రీజ్ లో రెడీగా ఉన్నాడు.
ఈ క్రమంలోనే బౌలర్ బంతి విసిరేందుకు పరిగెత్తుకు వస్తున్నాడు. ఈ స్పిన్ బౌలర్ బాల్ విసిరే సరికి తన చేయిని 5-6 సార్లు బొంగరం వలే తిప్పాడు. చివరికి బాల్ విసరగా.. అప్పటికే ఆ బ్యాటర్ కు చిరాకు వచ్చింది కాబోలు.. బంతిని ఆడకుండా పక్కకు తప్పుకున్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్ చూసి షాకయ్యాడు బ్యాటర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారాడంతో.. మీమర్స్, ట్రోలర్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ వీడియోకి ప్రత్యేక పాటలను జోడించి.. నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన నెటిజన్లు.. ఇదెక్కడి మాస్ బౌలింగ్ మావా? మా హర్భజన్ కంటే ఎక్కువ తిప్పుతున్నావ్ గా చేయిని అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అతడు స్విమ్మర్ అవుదామని అనుకుంటే.. వారి పేరెంట్స్ మాత్రం అతడిని బలవంతంగా క్రికెట్ లోకి పంపారు అనుకుంటా అంటూ ఇంకొందరు సరదాగా రాసుకొచ్చారు. మరి ఈ విచిత్ర బౌలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
When you wanted to become a swimmer but parents forced you to join cricket#CricketTwitter pic.twitter.com/OMoRWOH0Tx
— Rajabets 🇮🇳👑 (@smileagainraja) November 23, 2023