iDreamPost

Animal OTT Release Date: అనిమల్ సినిమా OTT పార్టనర్ ఎవరు? స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అనిమల్ చిత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ని అలరిస్తోంది. ఇప్పటిికే ఈ సినిమాకి నెట్టింట బిగ్గెస్ట్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. మరి.. ఈ చిత్రం ఏ ఓటీటీలో విడుదల కాబోతోందో తెలుసుకోండి.

అనిమల్ చిత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ని అలరిస్తోంది. ఇప్పటిికే ఈ సినిమాకి నెట్టింట బిగ్గెస్ట్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. మరి.. ఈ చిత్రం ఏ ఓటీటీలో విడుదల కాబోతోందో తెలుసుకోండి.

Animal OTT Release Date: అనిమల్ సినిమా OTT పార్టనర్ ఎవరు? స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ నోట ఒకటే మాట వినిపిస్తోంది. అదేంటంటే.. అనిమల్ సినిమా. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా అనిమల్ సినిమా గురించే చర్చలు చేస్తున్నారు. నెట్టింట అయితే బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ కామెంట్స పెట్టేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా అనేది సందీప్ రెడ్డి వంగా విజన్ కు జస్ట్ ట్రైలర్ అనే చెప్పాలి. అనిమల్ చిత్రం మాత్రం అందుకు పదిరెట్లు ఊహించుకున్నా కూడా తక్కువే అవుతుంది.

అర్జున్ రెడ్డి సినిమాలో మీరు ఒక అబ్బాయి- అమ్మాయి మధ్య ప్రేమను చూస్తారు. ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తే.. ఎంత వరకు వెళ్తాడు? ఎన్ని త్యాగాలు చేస్తాడు? ఎంతకు తెగిస్తాడు? అనే విషయాలను చూశారు. ఈ అనిమల్ చిత్రంలో అలాంటి ఒక బాండింగ్ తండ్రీకొడుకుల మధ్య ఉంటే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ఈ మూవీలో చూస్తారు. ఒక తండ్రిని కొడుకు ప్రేమిస్తే ఎలా లవ్ చేస్తాడు? ఆ తండ్రికి ఆపద వస్తే ఆ కొడుకు ఎంత దూరం వెళ్తాడు? ఎంతకు తెగిస్తాడో క్లియర్ గా చూపించారు. ఇది ఒక కంప్లీట్ లవ్ స్టోరీ. తండ్రీకొడుకుల మధ్య ఉండే ప్రేమానురాగాలను చెప్పే చిత్రం ఇది. ఈ మూవీలో ఓపెనింగ్ సీన్ నుంచి క్లోజింగ్ సీన్ వరకూ ఎక్కడా కూడా మీ అటెన్షన్ ని పక్కకు పోనివ్వడు. మిమ్మల్ని 3 గంటల 21 నిమిషాల 23 సెకన్ల 16 ఫ్రేముల పాటు సీటుకు అంచుకు కూర్చోబెడతాడు.

మూవీలో యాక్షన్ గురించే అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉన్న 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు మీ మైండ్ లో నుంచి పోవు. ఇంక మ్యూజిక్ అయితే నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. బీజీఎం మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి ఒక సినిమాని ప్రేక్షకులు కచ్చితంగా రిపీటెడ్ గా చూస్తారు. తొలి ఆట నుంచి ఈ మూవీకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలాంటి సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది? అనే ప్రశ్న కచ్చింతగా అందరికీ వస్తుంది. అందుకు సమాధానం ఏంటంటే.. ఈ మూవీ ఓటీటీ పార్టనర్ నెట్ ఫ్లిక్స్. మీరు అనిమల్ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూడచ్చు. అయితే విడుదలకు మాత్రం కాస్త టైమ్ పడుతుంది. ప్రస్తుతానికి జనవరి 26న ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని చెబుతున్నారు. టాక్ ని బట్టి చూస్తే ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇంకాస్త లేట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే దాదాపు 2 నెలల వ్యవధి ఉంది కాబట్టి ఈ డేట్ పోస్టుపోన్ అయ్యే అవకాశం లేదని చెప్పచ్చు. పైగా ఓటీటీలోకి వచ్చేటప్పుడు డ్యూరేషన్ ఇంకో 30 నిమిషాల వరకు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి.. అనిమల్ సినిమా మీరు చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి