iDreamPost

ఫ్రీ బస్ ఎఫెక్ట్: జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వైరల్ వీడియో!

Free Bus Effect: ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వైరలవుతున్న అంశం. అయితే ఈ ఉచిత ప్రయాణం వల్ల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి.

Free Bus Effect: ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వైరలవుతున్న అంశం. అయితే ఈ ఉచిత ప్రయాణం వల్ల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి.

ఫ్రీ బస్ ఎఫెక్ట్: జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వైరల్ వీడియో!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారిన విషయం ఏదైనా ఉందంటే అది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే చెప్పాలి. మహిళలకు ఫ్రీ బస్ అనే హామీ ఇస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుందని రాజకీయ పార్టీలు కూడా బలంగా నమ్మే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా.. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీని చేర్చి.. ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఫ్రీ బస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. మరీ ముఖ్యంగా బస్సుల్లో సీట్ల కోసం మహిళలు యుద్ధాలు కూడా చేసుకుంటున్నారు.

కర్ణాటకలో ఫ్రీ బస్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు మహిళలు కొట్టుకుంటున్న ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే కొన్నిరోజులు మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. తాజాగా మారోసారి కర్ణాటకలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనేది కనిపించింది. మహిళలు దారుణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే అది ఏ డిపోలో జరిగిందనే విషయం తెలియరాలేదు. కానీ, ఆ వీడియోలో మహిళలు, యువతులు కొట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడున్న పురుషులు కలగజేసుకుని.. వారిని వేరు చేసే ప్రయత్నం చేశారు. బస్సు ఎక్కుతున్న సమయంలోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. యువతులు అందరూ కాలేజీ స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు. యువతులు కూడా ప్రతిఘటించారు. మహిళలపై దాడి చేశారు. వీళ్లు ఇలా కొట్టుకుంటుంటే చాలా మంది మాత్రం బస్సులో సీటు పోతుందనే భయంతో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు. ఇంకొంతమంది మాత్రం ఈ గొడవను వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారు.

కర్ణాటకలో మొదటి నుంటి ఈ ఉచిత బస్సు ఎఫెక్ట్ మాత్రం కనిపిస్తూనే ఉంది. మహిళలకు ఉచిత ప్రయాణం అనగానే ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. అందరూ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. కానీ, తాకిడికి తగిన ఏర్పాట్లు చేయడంలో కర్ణాటక ఆర్టీసీ అధికారులు వెనుకబడినట్లు కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు సర్వీసులు నడపడం చేశారు. అంతేకాకుండా అనుకోని సమస్యలు తలెత్తకుండా కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కొన్ని నెలల్లో వాయిదాల పద్ధతిలో టీఎస్ఆర్టీసీ 2,050 కొత్త బస్సులు కొనుగోలు చేయనుంది. వాటిలో వెయ్యి బస్సులు ఎలక్ట్రిక్ వి కాగా.. 1,050 బస్సులు డీజిల్ వి అని ఎండీ సజ్జనార్ ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ మాదిరిగానే కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ మహిళలకు ఉచిత ప్రయాణంపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టీఎస్ఆర్టీసీ కూడా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. మరి.. కర్ణాటకలో ఫ్రీ బస్సు వల్ల మహిళలు కొట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి