iDreamPost

Deep Fake: వీడియో కాల్‌లో బాస్ అని చెప్పి 207 కోట్లు కాజేసిన స్కామర్

డీప్ ఫేక్ టెక్నాలజీ.. ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సెలబ్రిటీల మార్ఫింగ్ వీడియోలు చేయడమే కాదు.. సాధారణ మనుషులను కూడా బోల్తా కొట్టించి కోట్లు కాజేస్తున్నారు. తాజాగా ఓ కేటుగాడు బాస్ నని నమ్మించి 207 కోట్లు కాజేశాడు.

డీప్ ఫేక్ టెక్నాలజీ.. ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సెలబ్రిటీల మార్ఫింగ్ వీడియోలు చేయడమే కాదు.. సాధారణ మనుషులను కూడా బోల్తా కొట్టించి కోట్లు కాజేస్తున్నారు. తాజాగా ఓ కేటుగాడు బాస్ నని నమ్మించి 207 కోట్లు కాజేశాడు.

Deep Fake: వీడియో కాల్‌లో బాస్ అని చెప్పి 207 కోట్లు కాజేసిన స్కామర్

డీప్ ఫేక్ టెక్నాలజీ ప్రస్తుతం.. డిజిటల్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశం. ఈ టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి తెలీదు గానీ దుష్ప్రయోజనాలు మాత్రం అనేకం ఉన్నాయి. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడి అనేక మంది సెలబ్రిటీలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటీవల రష్మిక మందన్న కూడా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడిన సంగతి తెలిసిందే.  ఈ ఫేక్ వీడియోని క్రియేట్ చేసిన గుంటూరుకు చెందిన నవీన్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా తెలిసిందే. అయితే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీతో అమ్మాయిలకే కాదు.. మగాళ్ళకి కూడా ముప్పే.

ఈ టెక్నాలజీ కారణంగా లక్షలు, కోట్లు కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వ్యక్తిలా డీప్ ఫేక్ ముసుగు వేసుకుని వీడియో కాల్ చేస్తాడు. సేలరీ రాగానే ఇచ్చేస్తాను.. డబ్బులు అరేంజ్ చెయ్ మావా అని మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. కాల్ చేసినప్పుడు ఆ స్కామర్ ని చూస్తే మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వ్యక్తిలానే కనబడతారు. దీంతో మీరు నిజమని చెప్పి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. కట్ చేస్తే కాసేపటికి మీరు మోసపోయినట్టు గ్రహిస్తారు. ఈ స్కామర్స్ ఎంతలా ముదిరిపోయారంటే.. ఫేస్ నే కాకుండా వాయిస్ ని కూడా మార్ఫింగ్ చేసేస్తున్నారు. ఇలా లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. తాజాగా ఒక ఉద్యోగి దగ్గర బాస్ అని చెప్పి 25 మిలియన్ డాలర్లు కాజేశాడో స్కామర్. మన కరెన్సీ ప్రకారం 207 కోట్లు పైనే.

హాంగ్ కాంగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మల్టీనేషనల్ కంపెనీలో పని చేసే ఫైనాన్స్ ఉద్యోగికి ఒక మెయిల్ వచ్చింది. కంపెనీకి అవసరమైన రహస్య కార్యకలాపాల కోసం 207 కోట్లు అవసరమని మెయిల్ లో ఉంది. రహస్య కార్యకలాపాలు అనగానే నిందితుడికి డౌట్ వచ్చింది. కానీ ఆ డౌట్ ని డామినేట్ చేస్తూ స్కామర్లు.. వీడియో కాల్ చేసి నమ్మించే ప్రయత్నం చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీ యూజ్ చేసి అచ్చం కంపెనీ సహ ఉద్యోగుల్లానే కనిపించారు. దీంతో ఆ ఫైనాన్స్ ఉద్యోగి తాను మాట్లాడుతున్నది కంపెనీలో పని చేసే ఉద్యోగులే అని అనుకున్నాడు. వాయిస్ కూడా వారిలానే ఉండడంతో పూర్తిగా నమ్మేశాడు.

Deep fake 207 cr roberry

నమ్మకం కలిగిన తర్వాత.. స్కామర్లలో ఒకడు.. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ని మాట్లాడుతున్నా అని చెప్పి వీడియో కాన్ఫిరెన్స్ లో ఉండగానే 207 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించుకుని జంప్ అయిపోయాడు. 200 మిలియన్ హాంకాంగ్ డాలర్లు అంటే 25.6 మిలియన్ డాలర్లు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీ యూజ్ చేసి.. వీడియోలో, ఇతర ఫుటేజ్ ల్లో కనబడుతూ డబ్బుల కోసం ప్రజలను మోసం చేసే కేసులు ఎక్కువైపోయాయని పోలీసులు వెల్లడించారు. ఇటువంటి మోసాలకు పాల్పడిన ఆరుగురి నిందితులను అరెస్ట్ చేసినట్లు హాంకాంగ్ పోలీసులు తెలిపారు. హాంకాంగ్ కి చెందిన 8 మంది ఐడెంటిటీ కార్డుల మిస్ యూజ్ జరిగిందని హాంకాంగ్ అధికారి చాన్ వెల్లడించారు.

గత ఏడాది జూలై, సెప్టెంబర్ మధ్యలో ఆ కార్డులను ఉపయోగించి 90 లోన్ అప్లికేషన్లు, 54 బ్యాంకు ఖాతాల రిజిస్ట్రేషన్స్ చేశారని తెలిపారు. కనీసం 20 సందర్భాల్లో.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ డీప్ ఫేక్ టెక్నాలజీ ట్రిక్ తో.. ఐడెంటిటీ కార్డుల్లో ఉన్న వ్యక్తులను ఇమిటేట్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ ప్రోగ్రాంని మ్యానిప్యులేట్ చేశారని చాన్ తెలిపారు. ప్రస్తుతం జరిగిన 207 కోట్ల స్కామ్.. సదరు ఉద్యోగి తెలపడం వల్ల బయటపడిందని అన్నారు. 207 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాక కంపెనీ హెడ్ ఆఫీస్ ని సంప్రదించగా ఫేక్ సీఎఫ్ఓ అని తేలింది. జనవరి నెలాఖరులో అమెరికన్ పాప్ సింగర్.. టేలర్ స్విఫ్ట్ కి చెందిన ఏఐ జనరేటెడ్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో బాగా వ్యాప్తి చెందాయి.

దీంతో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఎంత ముప్పు ఉందో అనేది అర్థమవుతుంది. విదేశాల్లోనే కాదు.. భారత్ లోనూ సెలబ్రిటీలకు ఈ టెక్నాలజీతో ఎంతో ముప్పు పొంచి ఉంది. రష్మిక మందన్న వీడియో కూడా ఏఐ టెక్నాలజీతో సృష్టించిందే. ఇలా డీప్ ఫేక్ టెక్నాలజీని వాడుకుని ఇటు సెలబ్రిటీల ముఖాలు మార్ఫింగ్ చేస్తూ.. అటు మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఎవరైనా వీడియో కాల్ చేసి డబ్బులు అడిగితే జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్లేనా కాదా అనేది నిర్ధారించుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ షేర్ చేయండి. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ని అని చెప్పి 207 కోట్లు కొల్లగొట్టిన స్కామర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి