iDreamPost

ఆరు గ్యారంటీల పేరుతో జిరాక్స్ సెంటర్ల ఘరానా మోసం!

డబ్బు సంపాదించడం కోసం కొంతమంది ఘరానా మోసగాళ్ళు దేనికైనా సిద్దపడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అమాయకులకు ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని.. ప్రభుత్వ అధికారులు తమకు తెలుసు అని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు.

డబ్బు సంపాదించడం కోసం కొంతమంది ఘరానా మోసగాళ్ళు దేనికైనా సిద్దపడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అమాయకులకు ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని.. ప్రభుత్వ అధికారులు తమకు తెలుసు అని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు.

ఆరు గ్యారంటీల పేరుతో జిరాక్స్ సెంటర్ల ఘరానా మోసం!

ఈ మధ్య కాలంలో కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారు. ఎదుటి వారికి మాయమాటలు చెప్పి అడ్డగోలుగా దోచుకుంటున్నారు.  తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుందని, కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరంలోపే రెట్టింపు డబ్బు వస్తుంది, అధిక వడ్డీ ఆశ చూపించడం ఇలా ఎన్నో రకాలుగా మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు కేటుగాళ్ళు. గ్రామీణ స్థాయిలో మరికొంతమంది ఘరానా మోసగాళ్లు ప్రభుత్వ స్కీముల పేర్లు చెప్పి అమాయకులకు కుచ్చు టోపీ పెడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇలాంటి మోసాలపై అవగాహన కల్పిస్తున్నా కొన్నిచోట్ల దారుణంగా మోసపోతూనే ఉన్నారు.  ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి జనాలను మోసం చేస్తున్న ఓ కేటు గాడి గుట్టు విప్పారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇతర ప్రభుత్వ పథకాలు మీకు వచ్చేలా చేస్తాం అంటూ అమాయకులను దారుణంగా మోసం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అలాంటి మరో మోసం వెలుగులోకి వచ్చింది.  ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని క్యాష్ చేసుకున్నాడు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భరోసా కార్డులు ఉంటేనే ఆరు గ్యారెంటీ పథకాలకు అర్హులవుతారని అంటూ తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పకథం అమలు చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బసులో ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. దీన్ని కొంతమంది క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అచ్చంపేట పట్టణంలో ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలో ఉన్న లక్ష్మీ కంప్యూటర్స్, సీఎస్‌సీ సెంటర్ నిర్వాహకులు ఆరు గ్యారెంటీకు సంబంధించి భరోసా కార్డు విషయంలో అమాయకులను మోసం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు లబ్ధిదారులు అర్హత సంపాదించాంటే.. భరోసా కార్డు తప్పకుండా ఉండాలని తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంతో స్థానిక ప్రజలు దీని గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. భరోసా కార్డు కోసం వచ్చే వారి నుంచి రూ.50 చొప్పున వసూలు చేస్తూన్నాడు సదరు షాపు యజమాని. ఈ నేపథ్యంలోనే సదరు షాపు వద్దకు జనాలు భారీ ఎత్తున క్యూ కట్టారు. మూడు రోజులగా ఆ షాప్ యజమాని అమాయకులను దోచుకుంటూనే ఉన్నాడు. ఆరు గ్యారెంటీలకు గాను ఒక్కొక్కరి నుంచి రూ.300 చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో అమాయకులకు కుచ్చు టోపీ పెడుతున్నాడు. దీనిపై స్థానికంగా ఉన్న కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.. ప్రజలకు అవగాహన కల్పించడంతో అధికారులు నిర్లక్ష్యం వహించండ మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ద్వారా కానీ.. లేదా ఈ ఇతర ప్రచార సాధనాల ద్వారా కానీ పథకాలకు సంబంధించిన క్లారిటీ ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ఘరానా మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి