Somesekhar
Frank Duckworth Passed Away: క్రికెట్ మ్యాచ్ ల్లో వాన వచ్చినప్పుడల్లా అందరికి గుర్తుకు వచ్చేది డక్ వర్త్ లూయిస్ పద్ధతి. పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్ వర్త్ తుదిశ్వాస విడిచారు. ఆ వివరాల్లోకి వెళితే..
Frank Duckworth Passed Away: క్రికెట్ మ్యాచ్ ల్లో వాన వచ్చినప్పుడల్లా అందరికి గుర్తుకు వచ్చేది డక్ వర్త్ లూయిస్ పద్ధతి. పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్ వర్త్ తుదిశ్వాస విడిచారు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ‘డక్ వర్త్ లూయిస్’ పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్ వర్త్ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 84 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యల కారణంగా ఈనెల 21నే డక్ వర్త్ మరణించినట్లుగా ఓ వెబ్ సైట్ ద్వారా ఆలస్యంగా ఈ విషాద విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన మరణవార్త ఇంత ఆలస్యంగా ప్రపంచానికి తెలియడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో వాన వచ్చినప్పుడల్లా అందరికి గుర్తుకు వచ్చేది డక్ వర్త్ లూయిస్ పద్ధతి. ఇక ఈ పద్ధతిని డక్ వర్త్, లూయిస్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆవిష్కరించారు. క్రికెట్ లో కి ఈ సిస్టాన్ని ఐసీసీ 1997లో తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ పద్ధతి అమల్లో ఉంది. అయితే.. ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్.. ఈ పద్ధతికి కొన్ని మార్పులు చేశాడు. దాంతో అప్పటి నుంచి డీఎల్ కాస్త.. డక్ వర్త్ లూయిస్ స్టెర్న్(డీఎల్ఎస్)గా స్థిరపడింది. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగితే.. మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా 84 సంవత్సరా వయసులో డక్ వర్త్ మరణించారు.
Sad news for cricket.💔 Frank Duckworth, co-inventor of the DLS method, has passed away at 84. His contribution to fair play in rain-affected matches will be forever remembered. pic.twitter.com/BU4pLN8nLp
— CricketGully (@thecricketgully) June 25, 2024