iDreamPost

పండగ వేళ తీవ్ర విషాదం.. గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

కాగా ఏపీలోని తాళ్ళరేవు మండలం గోపిలంక వద్ద గోదావరి నదిలో విషాదం నెలకొన్నది. నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఓ ప్రైవేట్ రిసార్టులో బస చేసిన యువకులు స్నానాలు చేసేందుకు నదిలో దిగగా నది ప్రవాహానికి నలుగురు గల్లంతు అయ్యారని స్థానికులు తెలిపారు.

ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అప్పటి వరకు తమతో గడిపిన వారు ప్రమాదాలభారిన పడడంతో తీవ్ర విషాదం నెలకొంటుంది. కుటుంబ సభ్యులకు తీవ్ర శోకం కలుగుతుంది. కొన్ని సార్లు సరదాగా చేసే పనులు కూడా ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంటాయి. ఇదే విధంగా నలుగురు యువకులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగి ప్రవాహం ధాటికి గల్లంతయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. పండగ వేళ ఆనందంగా గడపాల్సిన వారు గోదావరి నదిలో గల్లంతవ్వడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

కాగా ఏపీలోని తాళ్ళరేవు మండలం గోపిలంక వద్ద గోదావరి నదిలో విషాదం నెలకొన్నది. నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఓ ప్రైవేట్ రిసార్టులో బస చేసిన యువకులు స్నానాలు చేసేందుకు నదిలో దిగగా నది ప్రవాహానికి నలుగురు గల్లంతు అయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వారిగా గుర్తించారు. అయితే మొత్తం 10 మంది స్నేహితుల బృందం విహార యాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వారిలో నలుగురు గోదావరిలో గల్లంతయ్యారని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి