iDreamPost

అనకొండని మించిన.. పాము అవశేషాలు! అచ్చం మహా భారతంలోని వాసుకిలా!

Fossils Of large Snake: పాములు అనగానే అందరికీ ఆఫ్రికా, అమెజాన్ అడవులు గుర్తొస్తాయి. అనకొండలు, కొండచిలువల గురించి మాట్లాడతారు. కానీ, వాటికి మించిన పాము అవశేషాలు ఇండియాలో దొరికాయి.

Fossils Of large Snake: పాములు అనగానే అందరికీ ఆఫ్రికా, అమెజాన్ అడవులు గుర్తొస్తాయి. అనకొండలు, కొండచిలువల గురించి మాట్లాడతారు. కానీ, వాటికి మించిన పాము అవశేషాలు ఇండియాలో దొరికాయి.

అనకొండని మించిన.. పాము అవశేషాలు! అచ్చం మహా భారతంలోని వాసుకిలా!

ఎవరికైనా పాము పేరు చెప్పగానే తడిసిపోతుంది. దానిని టీవీలు, ఫోన్లో వీడియోల్లో చూడాలి అన్నా కూడా వణికిపోతారు. అనకొండ మూవీ చూస్తున్నంత సేపు ఆ పాము గ్రాఫిక్స్ అని చెప్పుకుని ధైర్యాన్ని కూడగట్టుకుని చూస్తారు. అయితే అమెజాన్ అడవుల్లో అనకొండలు, కొండచిలువలు ఉంటాయని.. అవి చాలా భయంకరంగా, పెద్దగా ఉంటాయని వింటూ, చూస్తూ అమ్మో అంటూ ఉంటారు. కానీ, అమెజాన్ అడవుల్లో ఉండే కొండచిలువలు, అనకొండలకు మించిన పాము మన దేశంలోనే ఉండేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది కూడా ఏకంగా 15 మీటర్లు పొడవు ఉండటం అందరినీ ఆశ్చర్యానికే కాదు, భయాందోళనకు కూడా గురి చేస్తోంది.

తాజాగా గుజరాత్ లోని కచ్ లో ఒక పాము అవశేషాలు(ఫాజిల్స్) దొరికాయి. ఐఐటీ రూర్కీకి చెందిన బృందం కచ్ లో నిర్వహించిన తవ్వకాల్లో ఈ పాము అవశేషాలు బయటపడ్డాయి. వాటికి శాస్త్రవేత్తలు వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టారు. ఈ పాముకి సంబంధించి పూర్తిగా అవశేషాలు దొరకకపోయినా.. ఉన్న వాటిని బట్టి దాని సైజ్, వెయిట్, ఫ్యామిలీ ఇలా అన్నీ అంచనాలు వేశారు. ఆ పాము పొడవు దాదాపు 15 మీటర్లు ఉండచ్చు అంటున్నారు. అంటే దాదాపు 49 అడుగుల పొడవు అనమాట. అలాగే ఈ పాము బరువు దాదాపుగా వెయ్యి కిలోలు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. పొడవు పరంగా అంతరించిన పోయిన డైనాసార్లలో టీ-రెక్స్ ని మించిపోతుందని చెబుతున్నారు.

సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురితమైన కథనం ప్రకారం శాస్త్రవేత్తలు.. పాము వెన్నెముక భాగానికి చెందిన మొత్తం 27 ఎముకలను కనుగొన్నారు. ఈ అవశేషాలకు వాసుకీ ఇండికస్ అనే నామకరణం చేశారు. ఈ పాము మ్యాడ్ సోయిడీ పాము కుటుంబానికి చెందిందిగా గుర్తించారు. ఇది విషంలేని పెద్ద కొండచిలువ వంటిదని వెల్లడించారు. ఈ పాము జాతి ఎక్కువగా ఆఫ్రికా, యూరప్, భారత్ లో జీవించినట్లు చెప్పారు. ఈ అవశేషాలు దాదాపు 47 మిలియన్ సంవత్సరాలకు క్రితం అయి ఉంటాయనే అంచనాకు వచ్చారు. ఆకారంలో పెద్దది కాబట్టి.. ఈ వాసుకీ ఇండికస్ పాము చాలా నెమ్మదిగా కదిలేదిగా చెప్తున్నారు. అలాగే వేటం కోసం ఎదురుచూసి కాపుకాసి వేటాడేదిగా అభివర్ణించారు.

ఈ పాము వివరాలు తెలిసిన తర్వాత చాలామంది పురాణాల్లో చెప్పిన వాసుకీ నిజమేనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పురాణాల్లో ఎక్కువగా వాసుకీ ప్రస్తావన ఉండేది. ముఖ్యంగా మహా భారతంలో వాసుకీ గురించి స్పెసిఫిక్ గా చెప్పారు. అంతేకాకుండా ఆ రోజుల్లోనే ఆ పాము పొడవు, బరువు గురించి ప్రస్తావించారు. పురాణాల్లో వాసుకీ పొడవు 15 మీటర్లు, బరువు వెయ్యి కిలోలు అంటూ చెప్పారు. సాగర మథనానికి కూడా వాసుకీనే వాడారని.. శివుడు కరుణుంచి వాసుకీని మెడలో ఆభరణంగా ధరించారని చెప్తారు. పురాణాలకు సరిగ్గా సరిపోయేలా ఇప్పుడు ఈ వాసుకీ ఇండికస్ అవశేషాలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. వాసుకీ ఇండికస్ అవశేషాలు కచ్ లో దొరకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి