వరల్డ్ క్రికెట్ లో ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్ లో ఇసుమంతైనా మచ్చలేకుండా నిలిచినవారు ఉన్నారు. అయితే ప్రతీ క్రికెటర్ కెరీర్ లో వివాదాలు ఉన్నప్పటికీ.. మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి పెద్ద పెద్ద స్కామ్ లు చేసిన వారు తక్కువ. చరిత్రలో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధం ఎదుర్కొన్న ఎంతో మంది క్రికెటర్లను మనం చూశాం. కానీ శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి న్యాయ విచారణకు హాజరుకానున్న తొలి క్రికెటర్ సేనానాయకే కావడం గమనార్హం. శ్రీలంక మాజీ క్రికెటర్ సుచిత్ర సేనానాయకే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు.
శ్రీలంక మాజీ క్రికెటర్ సుచిత్ర సేనానాయకే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. లంక క్రీడా మంత్రిత్వశాఖలోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు సేనానాయకే బుధవారం లొంగిపోయాడు. కాగా.. సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్ ల్లో ఇతడు ఫిక్సింగ్ పాల్పడ్డాడని గత కొన్ని నెలలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే ఫోన్ లో సంప్రదించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అతడు విదేశాలకు వెల్లకుండా మూడు నెలల పాటు నిషేధం విధించింది స్థానిక న్యాయస్థానం. దీంతో అతడిపై అటార్నీ జనరల్ ఆదేశాల మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం సేనానాయక్ పై నేరారోపణలు మోపింది. ఈ క్రమంలోనే బుధవారం ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు లొంగిపోయాడు. కాగా.. 28 ఏళ్ల సేనానాయకే లంక తరపున 49 వన్డేలు, 24 టీ20ల్లో ఆడాడు. 2016 టీ20 వరల్డ్ కప్ గెలిచిన లంక జట్టులో సభ్యుడిగా సేనానాయకే ఉండటం గమనార్హం.
Update: Former Sri Lanka cricketer Sachitra Senanayake has been arrested! He has surrendered before the Sports Investigation Corruption Unit. There were allegations of match fixing on him. #AsiaCup2023 pic.twitter.com/c8f2C88tRa
— Imran Elahi RajPut (@RajputElahi) September 6, 2023