iDreamPost

అయోధ్యలో రాముడి దర్శనం చేసుకున్న వాళ్లంతా ముస్లింగా మారినట్టే: పాక్ మాజీ క్రికెటర్

దేశంలో వరల్డ్ కప్ ఫీవర్ ఫైనల్ స్టేజ్ కు చేరింది. అప్రతిహతంగా విజయాలను నమోదు చేసిన టీమిండియా.. ఆదివారం ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు ఇష్టమొచ్చినట్లు ఇండియాపై నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడొక వీడియో వైరల్ అవుతుంది.

దేశంలో వరల్డ్ కప్ ఫీవర్ ఫైనల్ స్టేజ్ కు చేరింది. అప్రతిహతంగా విజయాలను నమోదు చేసిన టీమిండియా.. ఆదివారం ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు ఇష్టమొచ్చినట్లు ఇండియాపై నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడొక వీడియో వైరల్ అవుతుంది.

అయోధ్యలో రాముడి దర్శనం చేసుకున్న వాళ్లంతా ముస్లింగా మారినట్టే: పాక్ మాజీ క్రికెటర్

భారత్ పై ఎప్పుడూ ఏదో ఒక ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పాకిస్తాన్. సరిహద్దు వివాదం, రాజకీయ పరంగా, క్రీడా పరంగా ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కతూ ఉంటుంది. అంతర్జాతీయ వేదికలపై కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తూ చీవాట్లు తింటూ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న సంగతి విదితమే. భారత్ విజయ దుందుభి మోగిస్తూ ఫైనల్‌కు చేరుకుంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని, అంపైర్లను టీమిండియా కొనేసిందంటూ దాయాది దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు, నటీమణులు సైతం నోటికి పని చెప్పారు. అంతేనా మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. పాక్ సరిగా ఆడకపోవడంపై మాట్లాడే క్రమంలో మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. ఐశ్వర్యరాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన, అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ ప్రేలాపనలు చేసిన సంగతి విదితమే.

దీనిపై ఆగ్రహ జ్వాలలు రావడంతో క్షమాపణ చెప్పాడు. తాజాగా మరో పాక్ మాజీ క్రికెటర్ .. ప్రముఖ దేవాలయంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, బాబ్రీ మసీదు ఘటన చరిత్రలో ఆనవాళ్లుగా మిగులుతుంది. అయితే సుప్రీంకోర్టు ఓ కొలిక్కి తెచ్చి.. హిందువులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు అక్కడ రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించేవాళ్లు హిందువులు ముస్లింలుగా బయటపడతారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘భారత ప్రధాని మోడీ చాలా మంచి పని చేశారు. ఓ మసీదును దేవాలయంగా మార్చారు. మన మూలాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి కాబట్టి.. ఆ గుడికి వెళ్లేవాళ్లంతా ముస్లింలుగా తిరిగి బయటకు వస్తారని నమ్ముతున్నాను. మీరు తప్పు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు’ అంటూ వివరించారు. అయితే ఈ వీడియో ఇప్పటిదీ కాదని, మూడేళ్ల కిత్రం నాటిదని తెలుస్తోంది. పలువురు పాక్ మాజీ క్రికెటర్లు నోరు పారేసుకుంటున్న వేళ .. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక జావేద్ .. 22 ఏళ్ల వయస్సులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి.. అతి పిన్న వయస్సులో ఆ బాధ్యతలు చేపట్టిన క్రికెటర్ అయ్యాడు. 1992లో పాక్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు జట్టు సభ్యుడిగా ఉన్నారు. మూడు పర్యాయాలు పాక్ జాతీయ జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి