iDreamPost

Derek Stirling: క్రికెట్ లో మరో విషాదం.. స్టార్ బౌలర్ మృతి!

ఒకే రోజు ఇద్దరు విండీస్ లెజెండరీ క్రికెటర్లు ప్రాణాలు వదిలిన విషాదం నుంచి క్రికెట్ ప్రేమికులు బయటకిరాకముందే.. మరో విషాదం క్రికెట్ లో చోటుచేసుకుంది. స్టార్ బౌలర్ మరణించిన వార్త అభిమానులను కలచివేసింది.

ఒకే రోజు ఇద్దరు విండీస్ లెజెండరీ క్రికెటర్లు ప్రాణాలు వదిలిన విషాదం నుంచి క్రికెట్ ప్రేమికులు బయటకిరాకముందే.. మరో విషాదం క్రికెట్ లో చోటుచేసుకుంది. స్టార్ బౌలర్ మరణించిన వార్త అభిమానులను కలచివేసింది.

Derek Stirling: క్రికెట్ లో మరో విషాదం.. స్టార్ బౌలర్ మృతి!

క్రికెట్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వెస్టిండీస్ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకే రోజు ఇద్దరు విండీస్ లెజెండరీ క్రికెటర్లు ప్రాణాలు వదిలారు. విండీస్ మాజీ స్పిన్నర్ క్లైడ్ బట్స్(66) రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. అదే రోజు మరో దిగ్గజ ఆటగాడు జో సోలమన్(93) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే.. ప్రపంచ క్రికెట్ లో మరో సంఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్(62) మరణించారు. ఈ విషయాన్ని కివీస్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

న్యూజిలాండ్ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కివీస్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్ బుధవారం వెల్లింగ్లన్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ అసోసియేషన్ తన సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది కివీస్ క్రికెట్ బోర్డ్. కాగా.. 1984-86 మధ్య కాలంలో కివీస్ కు ప్రాతినిథ్యం వహించారు స్టిర్లింగ్.

star bowler passed away

అయితే న్యూజిలాండ్ జట్టు తరఫున కేవలం 6 టెస్టులు, 6 వన్డేలు మాత్రమే ఆడాడు. ఓవరాల్ గా 13 వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ హ్యాడ్లీ, చాట్ ఫీల్డ్, లాన్స్ కెయిర్స్న్ వంటి దిగ్గజ పేసర్లు అప్పటికే జట్టులో ఉండటంతో.. స్టిర్లింగ్ కు పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. కానీ డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం అతడికి అమోఘమైన రికార్డు ఉంది. 84 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 206 వికెట్లు, అలాగే లిస్ట్-ఏ క్రికెట్ లో 65 మ్యాచ్ ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. దిగ్గాజలు జట్టులో ఉండటంతో.. అతి తక్కువ కాలంలోనే తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత హాక్స్ బే క్రికెట్ అసోసియేషన్ కు ఛైర్మన్ గా వ్యవహరించాడు స్టిర్లింగ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి