iDreamPost
android-app
ios-app

RCB కప్ కొట్టాలంటే.. అతడికి కెప్టెన్సీ పగ్గాలు అందించాలి: హర్భజన్ సింగ్

RCB కప్ కొట్టాలంటే.. డుప్లెసిస్ ను కెప్టెన్ గా తప్పించి అతడికి పగ్గాలు అందించాలని టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

RCB కప్ కొట్టాలంటే.. డుప్లెసిస్ ను కెప్టెన్ గా తప్పించి అతడికి పగ్గాలు అందించాలని టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

RCB కప్ కొట్టాలంటే.. అతడికి కెప్టెన్సీ పగ్గాలు అందించాలి: హర్భజన్ సింగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ 2024లో పడిలేచిన కెరటంలా దూసుకెళ్తోంది. ఈ సీజన్ లో తొలి 8 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచి.. ఇంటిదారి పట్టే స్థాయి నుంచి ప్లే ఆఫ్స్ కు వెళ్లే రేంజ్ కు చేరుకుంది. వరుసగా 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. ఈ సీజన్ లో ఈ ఘనత సాధించిన తొలి టీమ్ గా ఆర్సీబీ నిలిచింది. ఇలాంటి టైమ్ లో ఆర్సీబీపై టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్ హర్భజన్ సింగ్. RCB కప్ కొట్టాలంటే.. డుప్లెసిస్ ను కెప్టెన్ గా తప్పించి అతడికి పగ్గాలు అందించాలని భజ్జీ సూచించాడు.

ఆర్సీబీ  ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరాలంటే.. చెన్నైతో జరిగే మ్యాచ్ లో 18 పరుగులతో లేదా 11 బంతులు మిగిలి ఉండగానే గెలవాలి. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఒకవేళ బెంగళూరు టీమ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించకపోతే.. యాజమాన్యం కెప్టెన్సీపై పునరాలోచించాలి అంటూ చెప్పుకొచ్చాడు. విదేశీ ఆటగాడికి కెప్టెన్ గా తీసేసి, భారత స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీని తిరిగి ఆర్సీబీకి కెప్టెన్ గా చేయాలని సూచించాడు.

హర్భజన్ సింగ్ మాట్లాడుతూ..”ఈ సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లకపోతే.. విరాట్ కోహ్లీని తిరిగి కెప్టెన్ గా నియమించాలి. అతడిని ఎందుకు సారథిగా నియమించకూడదు? ఐపీఎల్ లో ధోని చూపిస్తున్న ఇంపాక్ట్ ను కోహ్లీ చూపించగలడు, అందులో ఎలాంటి సందేహం లేదు. విరాట్ కు పగ్గాలు అప్పగిస్తేనే జట్టును దూకుడుగా ముందుకు తీసుకెళ్లగలడు, ఉత్సాహం నింపగలడు. ఒక విధంగా చెప్పాలంటే, కోహ్లీని తిరిగి కెప్టెన్ చేస్తేనే ఆర్సీబీ కప్ కొడుతుంది” అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. మరి భజ్జీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి