iDreamPost

తొందరగా నిద్ర పట్టట్లేదా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

తొందరగా నిద్ర పట్టట్లేదా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

*నిద్ర పోవడానికి ముందు స్నానం చేయాలి దీని వలన మనం ఫ్రెష్ గా ఉండి తొందరగా నిద్ర పడుతుంది.
*పడుకునే పావుగంట ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంద్రాలలో రెండు చుక్కల చొప్పున వేసుకోవాలి.
*నిద్ర పోయే ముందు చాలా మంది వారి జీవితంలో జరిగే సంఘటనలని తలుచుకుంటూ ఉంటారు దానివలన కూడా నిద్ర పట్టదు, కాబట్టి ఆలోచనలను అన్నిటిని మన మనసులో నుండి పక్కకు పెడితే త్వరగా నిద్ర పడుతుంది.
* పడుకునే ముందు గోరువెచ్చని పాలు త్రాగితే మంచి నిద్ర పడుతుంది.
*రాత్రిపూట అరటిపండు తినడం వలన మన శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గి మంచి నిద్ర పడుతుంది.
*పడుకునే ముందు చెర్రీ ఫ్రూట్స్ తిన్నా, జ్యూస్ తాగిన మంచి నిద్ర పడుతుంది.
*రాత్రిపూట పెరుగన్నం లేదా మజ్జిగ అన్నం తిన్నా తొందరగా నిద్ర పడుతుంది.
*పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దన చేస్తే బాగా నిద్ర పడుతుంది.
*గసగసాలు దోరగా వేయించి వాటిని చల్లార్చి ఒక పలచని వస్త్రంలో ఉంచి వాసన పీల్చుకుంటే తొందరగా నిద్ర పడుతుంది.
*పడుకునే ముందు ధ్యానం చేస్తే చాలా తొందరగా నిద్ర వస్తుంది.
*చాలా మందికి ఏవైనా బుక్స్ చదివినా కూడా నిద్ర వస్తుంది. అలంటి వాళ్ళు బుక్స్ చదవడం మంచిది.
*ఏదయినా ప్రశాంతమైన పాటలు లేదా సంగీతం విన్నా కూడా తొందరగా నిద్ర వస్తుంది.
*ఇటీవల మనం అర్ధరాత్రి వరకు ఫోన్ పట్టుకొని ఉంటున్నాము. మొబైల్ లో ఉండే రేడియషన్ వలన కూడా నిద్ర త్వరగా రాదు. అందుకే నిద్ర పోవడానికి ముందు ఫోన్ ను దూరంగా ఉంచితే త్వరగా నిద్ర వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి