iDreamPost

విదేశంలో భారతీయులకు నరకం! టాయిలెట్‌ నీళ్లే ఆహారం!

విదేశంలో భారతీయులకు నరకం! టాయిలెట్‌ నీళ్లే ఆహారం!

చాలా మంది ఉపాధి కోసం సొంతవారిని వదిలేసి విదేశాలకు వెళ్తుంటారు. అక్కడి నుంచి పంపించే డబ్బులతో ఇక్కడ కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. మరికొందరు అయితే డాలర్లు సంపాదించాలనే కోరికతో విదేశాలకు ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాలకు వెళ్తుంటారు. అయితే వారు ఊహించని వాతావరణం అక్కడ ఉండదు.  ఏ చిన్న తేడా  వచ్చిన కూడా ఏళ్లకు ఏళ్లు జైళ్లలో  మగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తినడానికి తిండి లేక.. టాయిలెట్ రూమ్ ల్లోనే నిద్రిస్తూ జీవితాన్ని నరకంగా అనుభవిస్తుంటారు. ఇటువంటి నరకానే హర్యానకు చెందిన ఇద్దరు యువకులు ఎదుర్కొన్నారు. ఆరు నెలల తరువాత భారత్ కు తిరిగి వచ్చి.. తాము వెళ్లిన లిబియా దేశంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఢిల్లీలో మీడియాకు వివరించారు.

ఒక ఏజెంట్ తమను ఇటలీ పంపిస్తామని చెప్పి.. తమ వద్ద నుంచి రూ.13 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఇటలీ కాకుండా లిబియా దేశానికి పంపించారు.  దీనిపై ప్రశ్నించగా.. కొన్నాళ్లు లిబియాలో పని చేశాక ఇటలీ పంపిస్తామని నమ్మబలికాడని వారు తెలిపారు. అయితే  తమకు లిబియాలో ఎవరికో అమ్మివేశాడనే విషయం అక్కడి వెళ్లిన కొన్ని రోజులకు తెలిసిందని వారు తెలిపారు. అక్కడి వారు తమ చేత అన్ని రకాల పనులు చేయించారని, ఆ తరువాత ఏవో ఆరోపణలతో  కేసులు పెట్టి.. తమను జైలుకు పంపించారన్నారు. లిబియా జైలులో రెండు మూడు రోజుల పాటు ఎటువంటి ఆహారం ఇవ్వలేదని తెలిపారు. తాము బతికేందుకు జైళ్లోని టాయిలెట్ నీటిని అందించేవారన్నారు. లిబియా దేశంలో తమలాంటి వారు చాలా మంది ఉన్నారని, వారంతా భారత్ తో పాటు పలు దేశాలకు చెందినవారని ఆ యువకులు తెలిపారు.

తామంతా జైళ్లో నరకం చేరకం చూశామన్నారు. అసలు ప్రాణాలతో తిరిగి ఇండియాకు వస్తామని అనుకోలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తమలోని ఒక వ్యక్తి దగ్గర  ఫోన్ ఉంద ని, దాని ద్వారా రహస్యంగా భారత ఎంబసీకి ఫోన్ చేసి.. తమ బాధను వెళ్లబోసుకున్నామన్నారు.  ఎట్టకేలకు తమ ప్రయత్నాలు ఫలించి.. భారత విదేశీయ వ్యవహారాల అధికారుల సాయంతో  ఆరు నెలల తరువాత భారత్ కు  చేరుకోగలిగామన్నారు.  తమ సోదరుడు తిరిగి రావడం వనుక ప్రభుత్వం చొరవ ఉందని బాధితుడు సోదరి తెలిపారు. మరి.. ఇలా విదేశాలో మగ్గిపోతున్న భారతీయుల విషయంలో పరిష్కారం కోసం మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి