iDreamPost

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్స్‌!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్స్‌!

ఈ కామర్స్‌ సైట్లు అమ్మకాల్లో పోటీ పడేందుకు ఎప్పటికప్పుడు మంచి, మంచి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో పేరున్న బడా కంపెనీలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇక, స్వాంతంత్ర దినోత్సవాన్ని పురుస్కరించుకుని ఇప్పటికే అమెజాన్‌ ‘‘ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌’’ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితమే ఓ ప్రకటన చేసింది. ఫోన్లు, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఫ్లిప్‌కార్ట్‌ కూడా రంగంలోకి దిగింది. ‘‘ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌’’ను ప్రకటించింది. ఆగస్టు 3.. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్‌ మొదలు కానుంది. ఆగస్టు 9 వరకు సేల్‌ ఉండనుంది. ఈ సేల్‌లో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్ 11లు భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 14 రూ.68,999లకు, ఐఫోన్ 11 రూ. 41,999లకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌ సందర్భంగా వీటిపై మరింత తగ్గింపు ఉండే అవకాశం ఉంది.

వీటితో పాటు మిగిలిన 5జీ ఫోన్లు కూడా భారీ తగ్గింపు ధరలకే అందుబాటులో ఉండనున్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22ప్లస్‌ ప్రస్తుతం రూ. 59,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై పెద్ద మొత్తంలో డిస్కౌంట్‌ ఉండనుంది. పిక్సెల్‌ 5ఏ, సాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ప్లిప్‌ 3 లాంటి ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. అంతేకాదు! ఐసీఐసీఐ, కోటక్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా ఫోన్లను కొంటే 10 శాతం డిస్కౌంట్‌ రానుంది. ఇక, యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా ఫోన్‌ కొంటే 5 శాతం డిస్కౌంట్‌ రానుంది. మరి, ఫ్లిప్‌కార్ట్‌ ‘‘ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌’’పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి