iDreamPost

దీపావళి సేల్‌లో భారీ డిస్కౌంట్‌.. రూ. 25 వేల సౌండ్‌ బార్‌ రూ. 12 వేలకే

  • Published Nov 04, 2023 | 3:34 PMUpdated Nov 04, 2023 | 3:34 PM

పండుగల సందర్భంగా ఈకామర్స్‌ సంస్థలు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోట్‌ సౌండ్‌ బార్‌ మీద ఏకంగా 51 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

పండుగల సందర్భంగా ఈకామర్స్‌ సంస్థలు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోట్‌ సౌండ్‌ బార్‌ మీద ఏకంగా 51 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published Nov 04, 2023 | 3:34 PMUpdated Nov 04, 2023 | 3:34 PM
దీపావళి సేల్‌లో భారీ డిస్కౌంట్‌.. రూ. 25 వేల సౌండ్‌ బార్‌ రూ. 12 వేలకే

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. వంటింటి సరుకులు మొదలు.. వాషింగ్‌ మెషిన్‌ వరకు ప్రతి దాన్ని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ఒక పదేళ్లతో పోలిస్తే.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఈకామర్స్‌ సంస్థలు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక పెద్ద పండగలైన దసరా, దీపావళి సందర్బంగా చాలా ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తాయి. మొన్నటి వరకు దసరా సందర్భంగా ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌.. ప్రస్తుతం దీవాళికి కూడా భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటించింది. ఈ క్రమంలో 25 వేల రూపాయల విలువ చేసే సౌండ్‌ బార్‌ని.. రూ.12 వేలకే అందుబాటులో ఉంచింది. ఆ వివరాలు..

ప్రసుత్తం జనాలు స్మార్ట్‌, భారీ స్క్రీన్‌తో కూడిన టీవీలు కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నారు. ఇక స్క్రీన్‌ను తగ్గట్లుగానే సౌండ్ సిస్టమ్‌ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. దాంతో సౌండ్‌ బార్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్‌ దీపావళి సేల్‌లో భాగంగా బోట్‌ కంపెనీకి చెందిన సౌండ్‌ బార్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

బోట్‌.. ఇటీవల బోట్ అవంతే బార్‌ 3100డీ పేరుతో మార్కెట్‌లోకి ఓ సౌండ్‌ బార్‌ను లాంచ్‌ చేసింది. ఇది 260 వాట్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ సౌండ్‌ బార్‌ అసలు ధర రూ. 24,990కాగా.. ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి ఆఫర్‌లో భాగంగా 51 శాతం డిస్కౌంట్‌తో రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాక.. వేర్వేరు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనపు డిస్కౌంట్‌ లభించనుంది.

ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఒకవేళ ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ బార్‌ను రూ. 10,249కే సొంతం చేసుకోవచ్చు అన్నమాట.

ఫీచర్లు..

ఇక ఈ సౌండ్‌ బార్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 80-20,000 హెచ్‌జెడ్‌ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్‌ను ఇస్తుంది. డాల్బీ డిజిటల్/డిజిటల్‌ ప్లస్‌ వంటి సౌండ్‌ ఫీచర్‌ను అందించారు. దీనిలో 60 వాట్స్‌ వైర్డ్‌ సబ్‌ వూఫర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో యూజర్లు నాణ్యమైన సౌండ్‌ని పొందొచ్చు. ఇందులో 200 వాట్స్‌ ఆర్‌ఎమ్‌ఎస్‌ ప్రీమియం ఆడియోను అందించారు. బోట్ సిగ్నేచర్ సౌండ్‌ ఫీచర్‌ ఈ సౌండ్‌ బార్‌ సొంతం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి