iDreamPost

నిమిషాల్లో 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

నిమిషాల్లో 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

కరోనా వైరస్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో మదుపరుల సంపద నిమిషాల వ్యవధిలోనే 5 లక్షల కోట్ల సంపద ఆవిరై పోయింది. కోవిడ్ 19 ఎఫెక్ట్ వల్ల ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

1100 పాయింట్ల దిగువన సెన్సెక్స్ కొనసాగుతుంది.300 పైగా పాయింట్ల నష్టంలో మార్కెట్ ట్రేడ్ అవుతోంది. కరోనా భయంతో మదుపరులు అమ్మకాలకు దిగడంతో షేర్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీని ఫలితంగా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ జీడీపీ పై కరోనా ఎఫెక్ట్ పడింది. ఫలితంగా ఒక ట్రిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది.

కరోనా భయంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్ళకపోవడం, రవాణా సౌకర్యాలను నిలిపివేయడం, ఉత్పత్తిని తగ్గించడం లాంటి పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. దీనిఫలితంగా పారిశ్రామికోభివృద్ది 5.7%కు తగ్గి, రిటైల్ విక్రయాల వృద్ధి 8% తగ్గాయి. ప్రపంచ జీడీపీ 1% తగ్గే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెటల్‌, ఐటీ, రియల్‌ఎస్టేట్‌ సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. టాటా స్టీల్‌, టాటా ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1110 పాయింట్ల నష్టంతో 38,635 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 313 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,319 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి