iDreamPost

ఏపీ సర్కార్‌ చొరవ – విడుదలైన మత్స్యకారులు

ఏపీ సర్కార్‌ చొరవ – విడుదలైన మత్స్యకారులు

ఏడాది కాలంగా పాకిస్థాన్‌ జైలులో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆంధప్రదేశ్‌ సర్కార్‌ చొరవతో పాక్‌ చెరలో ఉన్న 20 మంది జాలర్లు ఈ రోజు భారత్‌లో అడుగుపెట్టారు. పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద వారికి రాష్ట్ర మంత్రి మోపీదేవి వెంకటరమణ స్వాగతం పలికారు.

విజయనగరం జిల్లాకు చెందిన 20 మంది మత్స్యకారులు 2018 డిసెంబర్‌లో అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్లారు. పాక్‌ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ వారిని పాక్‌ అధికారులు నిర్బంధించారు. వారిని విడుదల చేయించేందుకు అప్పటి చంద్రబాబు సర్కార్‌ ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో మత్స్యకార కుటుంబాలు తమ వారిని విడిపించాలని వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి విడుదలకు కృషి చేస్తామని వారికి సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఈ విషయం విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆయన విదేశాంగ కార్యాలయంలో పలుమార్లు జరిపిన సంప్రదింపులు ఫలించాయి. మత్స్యకారుల కుంటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి