iDreamPost

కొత్తగా ఓటు వేస్తున్నారా? ఈ సూచనలు ఖచ్చితంగా తెలుసుకోండి!

తెలంగాణ లో నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా ఓటు వేసే వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణ లో నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా ఓటు వేసే వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

కొత్తగా ఓటు వేస్తున్నారా? ఈ సూచనలు ఖచ్చితంగా తెలుసుకోండి!

దేశ వ్యాప్తంగా గత నెల ఐదు రాష్ట్రాలకు ఎన్ని షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. తెలంగాణ, మధ్యప్రదేవ్, మిజోరాం, చత్తీస్ గఢ్, రాజస్థాన్. ఇక తెలంగాణలో నిన్నటిలో ప్రచార పర్వం ముగిసింది. ఈ ఏడాది గతంలో కన్నా రికార్డు స్థాయిలో కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. నవంబర్ 30, గురువారం అసెంబ్లీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. కొన్ని కీలక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా ఓటు వేసే వారికి సరై అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఓటు హక్కు ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభిస్తుంది. ఇందుకోసం సరైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఎనిమిది లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. అయితే ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి? పోలింగ్ బూత్ లో ఎలా ఉంటుంది? అక్కడ చేయకూడని పనులు ఏంటీ? అనే విషయాలపై సరైన అవగాహన ఉండదు. అలాంటి వారి కోసం ప్రభుత్వ అధికారులు కొన్ని క్యాంపులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. పోలింగ్ స్టేషన్ లోపల ప్రక్రియ ఏలా ఉంటుందో తెలుసుకుందాం.

కొత్త ఓటర్లకు సూచన :

  • కొత్తగా ఓటు వేసేవారు పోలింగ్ బూత్ తెలుసుకునేందుకు electoralsearch.in  వెబ్‌సైట్‌లోకి వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఓటర్ హెల్ప్ లైన్ 1950 కి కాల్ చేసి పోలింగ్ బూత్ ఎక్కడో తెలుసుకోవొచ్చు.
  • మీ ఇంటి వద్దకు వచ్చి ఓటర్ స్లిప్పులు అందజేస్తారు.
  • ఒకవేళ మీకు ఓటర్ స్లిప్ రాకుంటే పోలింగ్ బూత్ కౌంటర్స్ వద్ద ఏజెంట్ల ద్వారా స్లిప్పులు తీసుకోవొచ్చు.
  • పోలింగ్ కేంద్రంలో మొదట అధికారి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో పరిశీలిస్తారు.
  • పోలింగ్ కేంద్రానికి ఓటర్ స్లిప్, ఓటరు గర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుని తీసుకొని వెళ్లాలి.
  • మీ వివరాలు చెక్ చేసిన తర్వాత మరో అధికారి వద్దకు పంపుతారు.. ఆ అధికారి మీ వేలుకు ఇంక్ రాసి ఒక చీటీ ఇస్తారు.
  • అక్కడ మరో అధికారి చీటీని పరిశీలించి ఈవీఎం ఏర్పాటు చేసి నిర్ధేశిత ప్రదేశాన్ని మీకు చూపిస్తారు.
  • ఈవీఎం లో పార్టీ అభ్యర్థి పేరు, గుర్తులు కనిపిస్తాయి. పక్కనే బటన్స్ ఉంటాయి.
  • మీరు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత పక్కన ఉన్న బ్లూ / నీలి రంగు బటన్ పై జాగ్రత్తగా నొక్కాలి.
  • ఓటు వేసినట్లు కన్ఫామ్ కాగానే.. ఎరుపు సిగ్నల్ వస్తుంది.. దాంతో పాటు పెద్దగా బీప్ సౌండ్ వినిపిస్తుంది.
  • మీరు ఓటు వేసిన తర్వాత ఒక స్లిప్ వస్తుంది.
  • ఈవీఎం పక్కన ఓటర్ వెరిఫియేబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) లో దాన్ని చూసుకోవచ్చు. మనం ఎవరికి ఓటు వేశం అనేది ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది.
  • ఒకవేళ మీకు బ్యాలెట్ స్లీప్ కనిపించకున్నా.. బీప్ శబ్ధం వినిపించకున్నా వెంటనే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించి క్లారిటీ తీసుకోవచ్చు.

కొత్తగా ఓటు వేస్తున్న ఓటర్లకు ముఖ్య గమనిక: ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకుపోవద్దు. అలాగే ఈవీఎం వద్ద నిలబడి సెల్ఫీ తీసుకోవద్దు.. అలా చేయడం చట్టరిత్యా నేరం. పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ మీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఏదైనా అనుమానం ఉంటే అక్కడ అధికారిని అడిగి తెలుసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి