iDreamPost

First Day Collections : రొమాంటిక్ వరుడు ఓపెనింగ్ కలెక్షన్స్

First Day Collections : రొమాంటిక్ వరుడు ఓపెనింగ్ కలెక్షన్స్

నిన్న ఎన్ని సినిమాలు రిలీజైనా అందరి కళ్ళు ఉన్నది మాత్రం వరుడు కావలెను, రొమాంటిక్ ల మీదే. రెండు ఒకదానికొకటి సంబంధం లేని చిత్రాలు కావడంతో నిర్మాతలు ఎవరికి వారు వసూళ్ల మీద ధీమాగా ఉన్నారు. థియేట్రికల్ బిజినెస్ చాలా రీజనబుల్ గా జరగడంతో బ్రేక్ ఈవెన్ కావడం అంత కష్టమేమి అనిపించలేదు. కాకపోతే మినిమమ్ టాక్ అవసరమైన నేపథ్యంలో రెండింటిలో దేనికీ యునానిమస్ గా సూపర్ హిట్ రిపోర్ట్స్ రాలేదు. ఉన్నంతలో ఓ వర్గం నుంచి పర్వాలేదనే మాట తప్ప మరీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో పబ్లిక్ రెస్పాండ్ కావడం లేదు. ఈ వీకెండ్ రెండు రోజులు వీటికి చాలా కీలకంగా మారబోతున్నాయి.

ముందు వరుడు కావలెను విషయానికి వస్తే ఫస్ట్ డే కలెక్షన్ సుమారుగా 1 కోటి 35 లక్షల దాకా షేర్ వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇది మంచి మొత్తమే. నిజానికి ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేవు. కారణాలు ఏవైనా కరెంట్ టికెట్ సేల్స్ లో చెప్పుకోదగ్గ ఫిగర్స్ వచ్చాయి. గ్రాస్ లెక్కలో చూసుకుంటే 2 కోట్ల 40 లక్షల దాకా ఉంటుంది. రొమాంటిక్ మొదటి రోజు పైదాని కన్నా మెరుగా 1 కోటి 60 లక్షల షేర్ రాబట్టిందట. అంటే గ్రాస్ ప్రకారం చూసుకుంటే 2 కోట్ల 50 లక్షలకు దగ్గరలో ఉంది. విచిత్రంగా వరుడు కావలెనులో సగం థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న రొమాంటిక్ దానికన్నా ఎక్కువగా రాబట్టుకోవడం ఫైనల్ ట్విస్ట్.

ఇప్పుడు ఈ శని ఆదివారాలు రెండు సినిమాలకు చాలా ముఖ్యం. సోమవారం నుంచి ఎలాగూ డ్రాప్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ అయితే పరిస్థితి వేరు కానీ ఇప్పుడలా కాదు. వరుడు కావలెను ఫ్యామిలీస్ ని రాబట్టగలిగినా అది ఏ స్థాయిలో అనేది వేచి చూడాలి. లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్పందన దీనికి కనిపించడం లేదు. ఇక రొమాంటిక్ ఈ మూడు రోజులు మాస్ యూత్ పుణ్యమాని కొంత రాబట్టుకోగలిగినా అసలు సవాల్ మండే నుంచి ఉంటుంది. వచ్చే శుక్రవారం రజినీకాంత్ పెద్దన్న, మారుతీ మంచి రోజులు వచ్చాయి, అక్షయ్ కుమార్ సూర్యవంశీ రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడీ ఆరు రోజులు ఏమేరకు రాబడతాయో చూడాలి

Also Read : Jai Bhajarangi : జై భజరంగి రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి