iDreamPost

భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా తగలబడిపోయిన రైల్వే స్టేషన్!

ఈ మద్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది.

ఈ మద్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది.

భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా తగలబడిపోయిన రైల్వే స్టేషన్!

దేశ వ్యాప్తంగా ఇటీవల వరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ వద్ద నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం గుర్తుకు వస్తే గుండెల్లో వణుకు పుడుతుంది. ఈ ప్రమాదంలో 300 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన తర్వాత పలు చోట్ల వరుస రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపాల వల్ల కొన్ని అయితే.. మనుషులు చేస్తున్న తప్పిదాల వల్ల కొన్ని జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా ఓ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా తగలబడి పోవడం తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అసన్ సోల్ జిల్లాలోని కుల్తీ రైల్వే స్టేషన్ అగ్ని ప్రమాదానికి గురై మొత్తం తగలబడిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి.. రైల్వే స్టేషన్ లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జీ సైతం కాలి కుప్పకూలిపోయింది. ఒక్కసారే స్టేషన్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న రైల్వే స్టేషన్ అధికారుల, సిబ్బంది రంగంలోకి దిగి వెంటనే రైల్వే లైన్ విద్యుత్ ని నిలిపివేశారు. ఫ్లాట్ ఫాం పై ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదానికి గల కారణం స్టేషన్ లో ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుండటమే అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఎలక్ట్రికల్ సామాగ్రి, కేబుల్ వైర్లు ఉన్న ప్రాంతంలోనే మంటలు చెలరేగి అంతటా వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. విచారణ తర్వాత ప్రమాదంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్దరించి.. రైళ్ల రాకపోకలకు అనుమతి ఇస్తామని తెలిపారు. వందల మంది ప్రయాణించే రైల్, రైల్వే స్టేషన్లలో ప్రమాదాలు జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి