iDreamPost

ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం.. రూ.80 లక్షల ఆస్తి నష్టం!

ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్ లోని నాంపల్లిలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం కారణం 9 మంది మరణించారు. తాజాగా ఫర్నిచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్ లోని నాంపల్లిలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం కారణం 9 మంది మరణించారు. తాజాగా ఫర్నిచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం.. రూ.80 లక్షల ఆస్తి నష్టం!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. షార్ట్ సర్య్కూట్, రసాయనాల పేలుడు, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో జీవితాన్ని నరకం అనుభవిస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. తాజాగా  పశ్చిమ గోదావారి జిల్లా లో ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం జరిగి.. భారీ ఆస్తి నష్టం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు మండలం పెంచికలమర్రు గ్రామంలో పురుషోత్తం ఎంటర్‌ప్రైజెస్‌ ఫర్నిచర్ షాపు ఉంది. గురువారం ఈ ఫర్నిచర్ దుకాణానికి చెందిన గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ షాపులో ఉన్న లక్షలాది రూపాయలు విలువచేసే ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు తదితర ఎలక్ట్రానిక్ సామాన్లు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. అగ్నిమాప సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. ఈ లోపు మంటలను అదుపు చేసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. అంతలోనే సమాచారం అందుకున్న కైకలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.

ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయినా షాపులోని విలువైన సామాన్లు పూర్తిగా కాలి బూడిదగా మారిపోయాయి. సుమారు రూ. 70 నుంచి రూ. 80 లక్షల వరకు ఆస్తినష్టం సంబంధించిందని ఆ ఫర్నిచర్  షాఫు యజమాని బలే వీరబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా అగ్నిప్రమాదాల కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగి.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరి.. అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి