iDreamPost

వీడియో: ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం!

వీడియో: ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. కొన్ని నెలల క్రితం సికింద్రబాద్ పరిధిలో జరిగిన రెండు అగ్నిప్రమాదాలు దాదాపు పది మంది మృతి చెందారు. తాజాగా ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ గా గుర్తింపు పొందిన అజాద్ పూర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…

శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌లో మంటలు చెలరేగాయి.  పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రాంతమంతా గందరగోళ వాతావరణం నెలకొంది. ఆసియాలోని అతిపెద్ద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ గా ఆజాద్‌పూర్ మండికి గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి నిత్యం కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్ లో శుక్రవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా మంటలు చెలరేగడంతో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 11 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మార్కెట్‌లోని టమాటా షెడ్డులో తొలుత మంటలు చెలరేగాయని, ఆ తరువాత మార్కెట్ అంతట వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ఆజాద్‌పూర్ మండి వద్ద టమాటా షెడ్డు వెనుక ఉన్న చెత్త కుప్పలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. కొద్దిసేపటికే మార్కెట్‌లోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరి.. అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి