iDreamPost

నిబంధనలు ఉల్లంఘించిన జర్నలిస్టుపై కేసు నమోదు….

నిబంధనలు ఉల్లంఘించిన జర్నలిస్టుపై కేసు నమోదు….

కోవిడ్ 19 వ్యాపిస్తున్న కారణంగా ప్రజలంతా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, ఒకవేళ విదేశాల నుండి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేశిస్తున్న ప్రజలు పాటించడం లేదు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరైన జర్నలిస్టుపై పోలీసులు FIR నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లో ఒక సీనియర్ జర్నలిస్టు కూతురు ఈ నెల 18 న లండన్ నుండి స్వదేశానికి వచ్చింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో క్వారంటైన్ లో ఉంచాలని అధికారులు సూచించారు. ఆమె వచ్చిన రెండు రోజుల తర్వాత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ కు జర్నలిస్టు హాజరయ్యారు. కాన్ఫరెన్స్ కు హాజరైన రెండురోజుల తర్వాత సదరు జర్నలిస్టు కుమార్తెకు కరోనా వైరస్ సోకినట్లు టెస్టుల్లో తేలింది. మరో మూడు రోజుల తర్వాత జర్నలిస్టుకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.

లండన్ నుంచి తిరిగి వచ్చిన కూతురు ఇంట్లో ఉండగా ప్రెస్ మీట్ కు హాజరైనందుకు మరియు హోమ్ క్వారంటైన్లో ఉండకుండా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన కారణంగా సదరు జర్నలిస్టుపై FIR నమోదు చేశారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు జర్నలిస్ట్ పై అభియోగాలు మోపి శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్లో IPC సెక్షన్188, 279,280 తో జర్నలిస్టుపై FIR నమోదు చేశారు పోలీసులు. అతనితో పాటు ప్రెస్ మీట్ కు హాజరైన జర్నలిస్టులను క్వారంటైన్ లో హాజరు కావాలని ఆదేశించారు అధికారులు. దీంతో ప్రెస్ కాన్ఫెరెన్సు కు హాజరైన తోటి జర్నలిస్టుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

కాగా మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 33 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. దేశవ్యాప్తంగా 791 మందికి కరోనా సోకగా 19 మంది మృత్యువాత పడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి