iDreamPost

OTTలో సంక్రాంతి సినిమాల జాతర.. ఏ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..?

సంక్రాంతి సమయంలో థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఏ సినిమా, ఎప్పుడు, ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో.. ఆ పూర్తి వివరాలు మీ కోసమే.

సంక్రాంతి సమయంలో థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఏ సినిమా, ఎప్పుడు, ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో.. ఆ పూర్తి వివరాలు మీ కోసమే.

OTTలో సంక్రాంతి సినిమాల జాతర.. ఏ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..?

జాతర అంటే మామూలు జాతర కాదూ.. సినిమా జాతర. థియేటర్లలో అనుకునేరు.. ఈ ఫెస్టివల్ ఓటీటీలో. సంక్రాంతి సమయంలో థియేటర్ల దగ్గర సందడి చేసిన సినిమాలన్నీ ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి దూసుకొస్తున్నాయి. అడపా దడపా సినిమాలు అయితే స్ట్రీమింగ్ అయిపోతున్నాయనుకోండి. ఏదైమైనా ఫిబ్రవరి మాత్రం ఓటీటీ ఫ్యాన్స్ కు పండగే పండుగ.. లోకల్ మూవీస్‌తో పాటు నాన్ లోకల్ మూవీస్ కూడా తమ డబ్బింగ్ వర్షన్లతో మూవీ లవర్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. వీటికి తోడు చిన్నా చితకా సినిమాలు, ఇతర వెబ్ సిరీస్‌లు కూడా జత చేరనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేద్దాం.

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన వెంకీ మామ మూవీ సైంధవ్.. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో దీన్ని చూసేయచ్చు. థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో అదరగొట్టేస్తుంది. అలాగే పెద్ద పండుగ నాడు ఈ పెద్దోడు కన్నా ముందే వచ్చాడు చిన్నోడు మహేష్ బాబు. గుంటూరు కారంలో రమణగా పలకరించి.. ఆ కుర్చీ మడత పెట్టి అంటూ ఊర మాస్ స్టెప్పులేసి.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు సూపర్ స్టార్. ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీలోకి రావడానికి రెడీ అయ్యింది. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో కూడా మహేష్‌కు పోటీ ఎదురైంది. అదే 9వ తేదీన.. ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ చిత్రం కెప్టెన్ మిల్లర్ అదే డిజిటల్ ఫ్లాట్ ఫాం నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక జనవరిలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న మరో సీనియర్ హీరో పిక్చర్ నా సామి రంగా.. మన్మధుడు నాగార్జున, ఆశిషా రంగనాథ్, నరేష్, రాజ్ తరుణ్ నటించిన ఈ చిత్రం పండుగకు ఫర్ ఫెక్ట్ మూవీగా నిలిచింది. ఈ పిక్చర్ కూడా ఫిబ్రవరి 15న రాబోతుంది.హాట్ స్టార్, హులులో వాచ్ చేసేయొచ్చు. అదే పొంగల్‌కు తమిళనాడులో రిలీజ్.. ఇక్కడ కూడా అదే రోజు తెలుగులో వచ్చేందుకు సిద్ధమైన మూవీ అయలాన్. అయితే కాస్తంత విమర్శలు రావడంతో వెనక్కు తగ్గింది. మొత్తానికి థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీతో సరిపెట్టేసుకుంటుంది. ఫిబ్రవరి 16న సన్ నెక్ట్స్ లో వీక్షించవచ్చు. కెప్టెన్ మిల్లర్, అయలాన్ రెండు తెలుగులో కూడా రానున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో బహుశా.

లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్న కళ్లకు స్వాంతన కలిగించే న్యూస్ ఇది. పండుగకు చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద చర్చకు దారి తీసిన చిత్రంగా మారింది హనుమాన్. సజ్జా తేజ నటన, ప్రశాంత్ వర్మ కరేజ్ సినిమాను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఈ సంక్రాంతి రోజులో బిగ్గెస్ట్ హిట్ మూవీగా మారిపోయింది హనుమాన్. ఇప్పుడు ఈ పిక్చర్ కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. హనుమాన్ మార్చి 22న డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి రాబోతున్నట్లు సమాచారం. జీ 5లో స్ట్రీమింగ్ కాబోతుంది. హనుమాన్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసిందట జీ 5.అన్ని సినిమాలు ఇంచు మించు థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే వస్తుంటే.. ఒక్క హనుమాన్ మాత్రం.. రెండు నెలల తర్వాత ల్యాండ్ అవుతుంది. ఇందులో మీరు చూడాలనుకుంటే మూవీ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి