iDreamPost
android-app
ios-app

ఆకాశం రిపోర్ట్

ఆకాశం రిపోర్ట్

కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజైన విషయం టీవీలో వచ్చినప్పుడో ఓటిటి ప్రీమియర్ జరిగినప్పుడో తెలుస్తాయి. నిన్న జరిగిన బాక్సాఫీస్ తొక్కిడిలో కొన్ని చిత్రాల పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తుంది. హిట్టు ఫ్లాపు తర్వాత అసలు జనానికి మన బొమ్మొకటి వచ్చిందన్న విషయం బలంగా రిజిస్టర్ చేయకపోతే కనీస ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి లేదిప్పుడు. అందులోనూ విపరీతమైన పోటీ మధ్య దిగుతున్నప్పుడు పబ్లిసిటీ చాలా ముఖ్యం. స్టార్ క్యాస్టింగ్ పెట్టకుండా, విజువల్ గ్రాండియర్ నెస్ లేకుండా జనాన్ని హాలు దాకా రప్పించడం పెద్ద సవాల్. అలాంటి సాహసానికి పూనుకుంది ఆకాశం బృందం. సింపుల్ టైటిల్ తో వచ్చిన ఈ మూవీ రిపోర్ట్ ఏంటో చూద్దాం.

Aakasam Movie Review: ఆకాశం తెలుగు మూవీ రివ్యూ - VoiceOfAndhra - తెలుగు  Latest News | Online Telugu News

అర్జున్(అశోక్ సెల్వన్)చాలా క్యాలికులేటెడ్ గా జీవితాన్ని గడిపే వ్యక్తి. అలా అని అందరితో కలిసిపోయే రకం కాదు కానీ తన పనేదో చూసుకుంటూ ప్రతిదానికి విపరీతంగా ఆలోచించడం అలవాటుగా మార్చుకుంటాడు. అనుకోకుండా కుదిరిన పెళ్లి ఆగిపోవడంతో అర్జున్ తట్టుకోలేకపోతాడు. డిప్రెషన్ వచ్చేస్తుంది. పుస్తకాలు విపరీతంగా చదివే అలవాటున్న అర్జున్ ఓ డాక్టర్ ఇచ్చిన డైరీలను చదవడం ద్వారా మానసిక స్వాంతన పొందే ప్రయత్నం చేస్తాడు. వాటిలో రెండు జంటల కథలు ఉంటాయి. అక్కడ ఉన్న పాత్రల్లో తననే ఊహించుకుంటూ వాటి ముగింపు దగ్గరికొచ్చేసరికి ఒక ట్విస్టు వచ్చి పడుతుంది. అదేంటనేది ఇక్కడ కంటే స్క్రీన్ మీద చూస్తేనే బెటర్.

Aparna Balamurali on Twitter: "Thank you sirr ❤️❤️❤️" / Twitter

ఒకరకంగా చెప్పాలంటే ఇది బిగ్ స్క్రీన్ కంటే వెబ్ కి ఫిట్ అయ్యే కంటెంట్. మంచి లైన్ ఉన్నప్పటికీ అది థియేటర్ మెటీరియల్ అనిపించే స్థాయిలో లేకపోవడం ఆకాశంకున్న ప్రధాన మైనస్. అశోక్ సెల్వన్ తో పాటు రీతువర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఉపకథల ప్రహసనం కావడంతో కామన్ ఆడియన్స్ కి ఇదంతా సాగతీత వ్యవహారంలా అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా ఎవరినీ పెద్దగా వంక పెట్టడానికి లేదు కానీ దర్శకుడు రా కార్తీక్ ఎమోషన్స్ ని సాగదీసిన తీరు ఆకాశం చూస్తున్న ఆడియన్స్ ని నీరసానికి గురి చేస్తుంది. బోర్ ఉన్నా పర్లేదు కొన్ని ఎమోషన్స్ ఉంటే చాలనుకుంటే తప్ప ఈ మల్టీలేయర్ డ్రామా ఆకట్టుకోవడం కష్టం.