iDreamPost

ఓటమి తెచ్చిన మార్పు

ఓటమి తెచ్చిన మార్పు

అధికారంలో ఉన్నన్నాళ్లు ఊగిపోయిన వారికి ఇప్పుదు రోజులేమీ బాగోలేవనిపిస్తుంది. నచ్చినా నచ్చకపోయినా.. రోజంతా చచ్చినట్టు చెప్పినట్టు వినే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు రివర్స్ అయ్యిందని తెగ ఫీల్ అవుతున్నారు.

రక్షణగా ఉండే రక్షక భటులను ఎవ్వరూ రక్షించలేరని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పుడోలా ఇప్పుడోలా మాట్లాడుతున్న చంద్రబాబు మాటలను వింటున్న వారంతా మీరే చెప్పాలి బాబు ఏది కరెక్టో అంటున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ప్రజల్లో తలెత్తుకోలేని ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనిపించిన ఎదురొచ్చిన వారందరిపైన తన ఆవేశాన్ని వెలగక్కుగుతున్నారు. అధికారంలో ఉండి ప్రజల నుండి ఘోర ఓటమి తర్వాత ప్రతిపక్ష స్థానంలో ఉండలేకపోతున్నారు.

తాజాగా అనంతపురం పర్యటనలో చంద్రబాబు పోలీసులపై ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలిసిందే. ఆ పార్టీ నేతలు పోలీసులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా చంద్రబాబు వారినే సపోర్ట్ చేసి మాట్లాడారు. తన జోలికొస్తే వదిలిపెట్టను అంటూ తెగ ఆవేశంగా మాట్లాడుతున్నారు. పోలీసులపై చంద్రబాబు పార్టీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉంటే ఈ విధంగా మాట్లాడితే ఎలా అని మాట్లాడుకుంటున్నారు. అధికారం కోల్పోయక చంద్రబాబు వారి పార్టీ నేతలకు సహనం లేదన్న చర్చ నడుస్తోంది.

అధికారంలో ఉన్నప్పుడు అధికారులు లేనిదే ఒక్క నిముషం ఖాళీగా ఉండలేని చంద్రబాబు పవర్ లో లేనప్పుడు కూడా పోలీసులపై తన పెత్తనం చేలాయించాలని అనుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో తనను ఒక్క మాట అంటే తట్టుకోలేని చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఉన్మాదిలా మారాడు, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటూ ఏ విధంగా అనగలుగుతున్నాడని కామన్ మ్యాన్ ఆలోచిస్తున్నాడు. అధికారం పోయిన తర్వాత చంద్రబాబు ప్రవర్తనలో మార్పు వచిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది బహిరంగ రహస్యం. ఇందుకు ఉదాహరణ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఇలా ఎవ్వరినీ లెక్కచేయకుండా మాట్లాడుతున్న భాష అనే తెలుస్తోంది. పవర్ ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా, బాధ్యతగా మసులుకోవాలన్నది చంద్రబాబుకు చెప్పవలసిన అవసరం ఉందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి