iDreamPost

అదృష్టం అంటే ఈ రైతుదే.. పొలంలో దొరికిన ఖరీదైన వజ్రం!

అదృష్టం ఎప్పుడు?ఎలా? ఎవరిని వరిస్తుందో.. ఎప్పుడూ చెప్పలేము. ఓ రైతు పొలం దున్నుతూ ఉండగా.. అనుకోని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రి ఆయన లక్షాధికారి అయిపోయాడు...

అదృష్టం ఎప్పుడు?ఎలా? ఎవరిని వరిస్తుందో.. ఎప్పుడూ చెప్పలేము. ఓ రైతు పొలం దున్నుతూ ఉండగా.. అనుకోని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రి ఆయన లక్షాధికారి అయిపోయాడు...

అదృష్టం అంటే ఈ రైతుదే.. పొలంలో దొరికిన ఖరీదైన వజ్రం!

జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, రైతులు మాత్రం వ్యవసాయాన్ని విడిచి పెట్టరు. కష్టమో, నష్టమో కొనసాగిస్తూనే ఉంటారు. పొలంలో బంగారం పండిస్తామని రైతులు సాధారణంగా చెబుతూ ఉంటారు. కానీ, కర్నూల్ జిల్లా కు చెందిన ఓ రైతుకు మాత్రం విత్తనం వేయకుండానే పంట పండింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా ! అవును, నిజంగానే ఆ రైతు పంట పండింది. ఎలా అంటే.. ఆ రైతు పొలం సాగు చేస్తూ ఉండగా వజ్రం దొరికింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్న సంగతి తెల్సిందే. దీంతో కర్నూల్ జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది.

తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన పొలాల్లో​ ఎక్కువగా కంది పంట సాగుచేస్తూ ఉంటారు. అయితే, పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఆ రైతుకు ఓ రాయి కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు. సాధారణ రాయిలా కాకుండా వజ్రపు రాయిలా మెరుస్తూ ఉండడటంతో.. అనుమానం కలిగి ఓ వజ్రాల వ్యాపారికి చూపించాడు. ఆ వ్యాపారి అది వజ్రమే అని రైతుకు చెప్పాడు. ఇక ఆ వ్యాపారి రూ. 6 లక్షలకు ఆ వజ్రాన్ని రైతు దగ్గర నుంచి కొనుగోలు చేశాడు.

సదరు రైతు తనకు కలిగిన అదృష్టం గురించి మాట్లాడుతూ.. గతంలో వజ్రాలు దొరుకుతున్నాయంటే ఆశ్చర్య పోయేవాడినని. కానీ, ఇప్పుడు తన పొలంలోనే వజ్రం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. తనకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు. కర్నూల్ జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, కొత్తూరు, పెరవిలి ప్రాంతాలలో వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. దీంతో కర్నూల్ జిల్లా వాసులే కాకుండా.. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా.. ప్రజలు ఈ ప్రాంతాలకు వెళ్లి వజ్రాల వేట కొనసాగిస్తుంటారు.

ఇక స్థానిక రైతులు, కూలీలు రోజుల తరబడి పొలాల్లోనే వజ్రాల కోసం గాలిస్తుంటారు. అంతేకాకుండా కర్నూల్ కు దగ్గరగా ఉండే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల నుంచి ఎక్కువమంది ప్రజలు వజ్రాల వేట కోసం వస్తూ ఉంటారు. గతంలోనూ చాలా సార్లు చాలా మందికి వజ్రాలు దొరికాయి. 30 లక్షలు పైగా పలికిన వజ్రాలు కూడా ఈ ప్రాంతంలో దొరికాయి. రాత్రికి రాత్రికి లక్షాధికారులు అయిన వారు కోకొల్లలు. ఏదేమైనా, ఆకలి తీర్చే రైతన్నకు వజ్రం రూపంలో అదృష్టం వరించడం ఆనందించ తగిన విషయం. మరి, పొలం దున్నుతుండగా.. వజ్రం దొరికి లక్షాధికారిగా మారిన రైతు అదృష్టంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి