iDreamPost
android-app
ios-app

SKY కోసం సంజూ శాంసన్ కు మళ్లీ అన్యాయం! రోహిత్ ఇది పద్దతేనా అంటూ ఫ్యాన్స్ ఫైర్..

  • Author Soma Sekhar Published - 06:10 PM, Fri - 28 July 23
  • Author Soma Sekhar Published - 06:10 PM, Fri - 28 July 23
SKY కోసం సంజూ శాంసన్ కు మళ్లీ అన్యాయం! రోహిత్ ఇది పద్దతేనా అంటూ ఫ్యాన్స్ ఫైర్..

సంజూ శాంసన్.. గత కొంతకాలంగా ఈపేరు టీమిండియా క్రికెట్ వర్గాల్లో బాగా వినిపిస్తోన్న పేరు. దానికి కారణం అద్భుతమైన ఆట, నైపుణ్యం గల ప్లేయర్ గా పేరున్నప్పటికీ అతడికి తగినన్ని అవకాశాలు ఇవ్వకపోడమే. సంజూ శాంసన్ కు సెలక్టర్లు అవకాశాలు ఇవ్వకపోవడంతో.. సగటు క్రికెట్ ఫ్యాన్స్ సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు. తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు శాంసన్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే తుది జట్టులో మత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అతడి స్థానంలో ఫామ్ లో లేని సూర్య కుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు. దాంతో శాంసన్ కు మళ్లీ అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మపై, సెలక్టర్లలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు మరోసారి అన్యాయం జరిగింది. విండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు ఎంపికైన ఈ కేరళ బ్యాటర్.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా మేనేజ్ మెంట్ ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చింది. దాంతో ఎన్నో రోజుల తర్వాత టీమిండియా నుంచి పిలుపు అందుకున్న శాంసన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ తో తొలి వన్డే స్టార్ట్ అయ్యే వరకు వికెట్ కీపర్ గా తొలి ప్రియారిటీ శాంసన్ కే ఉందని అందరు భావించారు. దానికి కారణం లేకపోలేదు.

ఈ క్రమంలోనే టాపార్డర్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ మిడిలార్డర్ లో రాణించలేడని, సంజూ ఈ వన్డేలో ఆడటం ఖాయం అనుకున్నారు. కానీ టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం టాప్-5 బ్యాట్స్ మెన్ లల్లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కొరతను తీర్చడానికి ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కేవలం సూర్యకుమార్ కోసమే సంజూ శాంసన్ ను పక్కన పెట్టారని భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్ మెంట్ అనుకున్నట్లుగానే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు సూర్యకుమార్ ను పక్కన పెట్టి సంజూ శాంసన్ ను ఆడించాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

కాగా.. రోహిత్ శర్మ కేవలం ముంబై క్రికెటర్ల కోసం శాంసన్ కు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. శాంసన్ ను బెంచ్ పై కూర్చోపెడదానికే తీసుకున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక్క మ్యాచ్ లో ఆడించి పక్కనపెడుతున్నారని, గతంలోనూ ఇదే విధంగా పక్కన పెట్టారని అభిమానులు గుర్తుచేస్తున్నారు. నాలుగో నెంబర్ బ్యాటర్ గా సూర్యకుమార్ బదులు శాంసన్ చక్కగా సరిపోయేవాడని, వరల్డ్ కప్ కూడా పనికొస్తాడని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి రోహిత్ శర్మ.. సూర్యకుమార్ కోసమే సంజూ శాంసన్ ను పక్కన పెట్టాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: శార్ధూల్ ఠాకూర్ ను తిట్టిన రోహిత్ శర్మ! సీరియస్ లుక్ తో..