iDreamPost

ఫైనల్లో టీమిండియా ఓటమి! మళ్లీ అందరికీ ధోని ఎందుకు గుర్తొస్తున్నాడు?

  • Author Soma Sekhar Published - 03:30 PM, Mon - 20 November 23

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో అందరికీ మహేంద్ర సింగ్ ధోనీనే గుర్తుకు వస్తున్నాడు. టీమిండియా మళ్లీ ఐసీసీ కప్ గెలవాలంటే ధోనినే రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి వారికి ధోని ఎందుకు గుర్తుకు వస్తున్నాడు? మహేంద్రుడు ఎందుకు గొప్ప?

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో అందరికీ మహేంద్ర సింగ్ ధోనీనే గుర్తుకు వస్తున్నాడు. టీమిండియా మళ్లీ ఐసీసీ కప్ గెలవాలంటే ధోనినే రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి వారికి ధోని ఎందుకు గుర్తుకు వస్తున్నాడు? మహేంద్రుడు ఎందుకు గొప్ప?

  • Author Soma Sekhar Published - 03:30 PM, Mon - 20 November 23
ఫైనల్లో టీమిండియా ఓటమి! మళ్లీ అందరికీ ధోని ఎందుకు గుర్తొస్తున్నాడు?

కొన్ని కోట్ల భారతీయుల కల, 11 మంది ఆటగాళ్ల కష్టం.. ఒకే ఒక్క మ్యాచ్ తో నీరుగారిపోయింది. ఎంత మంచి ఆటగాళ్లైనా, ఎంత బాగా ఆడుతున్నా.. ఆవగింజంత అదృష్టం లేక టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం పాలైంది. ఈ మెగాటోర్నీలో అపజయం అన్నదే లేని భారత జట్టు అసలు మ్యాచ్ లోనే చేతులెత్తేసింది. టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. ఫైనల్ చేరి.. కీలక పోరులో కంగారూలను కంగారు పెట్టలేకపోయింది. ఈ ఓటమి సగటు టీమిండియా ఫ్యాన్స్ ను తీవ్రంగా కుంగదీసిందనే చెప్పాలి. ఇక ఈ ఓటమితో మళ్లీ అందరికీ మహేంద్ర సింగ్ ధోనీనే గుర్తుకు వస్తున్నాడు. టీమిండియా మళ్లీ ఐసీసీ కప్ గెలవాలంటే ధోనినే రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి వారికి ధోని ఎందుకు గుర్తుకు వస్తున్నాడు? మహేంద్రుడు ఎందుకు గొప్ప? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా ఫ్యాన్స్ కన్న కలలు మెుత్తం కల్లలుగానే మిగిలిపోయాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టైటిల్ పోరులో టీమిండియా 6 వికెట్లు తేడాతో ఓడిపోయిన సంగతి విధితమే. ఇక ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత కొత్త వాదన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? ఐసీసీ ట్రోఫీ టీమిండియా మళ్లీ టీమిండియా సాధించాలంటే మహేంద్ర సింగ్ ధోని రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా వారు చెప్పుకురావడానికి కారణాలు లేకపోలేదు. ధోని సారథ్యంలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన విషయం తెలిసిందే.

2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ తో పాటుగా ఓ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ జట్టు సాధించింది. ఈ మూడు కూడా ధోని కెప్టెన్ గా ఉన్న కాలంలోనే రావడం విశేషం. అయితే ప్రస్తుతం భారత్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కూడా తన అద్భుతమైన కెప్టెన్సీతో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న టీమ్ కూడా వరల్డ్ బెస్ట్ టీమే. కానీ ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా తయ్యారు అయ్యింది టీమిండియా పరిస్థితి. జట్టులో వరల్డ్ క్లాస్ బౌలర్లు, వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. కానీ ఆవగింజంత అదృష్టం మాత్రం లేదు. టోర్నీలో అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన జట్టు.. కీలక మ్యాచ్ లో ఓడిపోవడం బాధాకరం.

ఈ క్రమంలోనే ఐసీసీ ట్రోఫీ కొట్టడంలో ధోనీనే గొప్ప అంటున్నారు కొందరు ఫ్యాన్స్. ధోని తన మార్క్ కెప్టెన్సీతో ఓడిపోయే మ్యాచ్ లను సైతం గెలిపించి.. టీమిండియాను ఛాంపియన్స్ గా నిలిపాడు. మ్యాచ్ ను ప్రత్యర్థి లాగేసుకుంటున్న సమయంలో.. తనకే సాధ్యమైన కొన్ని మాస్టర్ ప్లాన్స్ తో మ్యాచ్ ను టీమిండియా వైపు తిప్పడంలో మన మహేంద్రుడు గొప్ప. అలాంటి మ్యాచ్ లు మనం ఎన్నో చూశాం కూడా. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా 50 పరుగుల లోపే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను టీమిండియా నిలువరించలేకపోయింది. అదే ధోని ఉంటే.. వరల్డ్ కప్ కచ్చితంగా భారతే గెలిచేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోని గొప్ప సారథి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నెటిజన్లు రాసుకొస్తున్న విధంగా ధోని ఉంటే ఈ వరల్డ్ కప్ గెలిచేవాళ్లమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి