iDreamPost

IND vs SA: 7 మంది డకౌట్.. కోహ్లీ, రోహిత్ లేకుంటే.. స్ట్రీట్ క్రికెట్ ఆడుకోవాలా?

భారత జట్టు చెత్త బ్యాటింగ్ పై టీమిండియా ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మీకన్నా స్ట్రీట్ క్రికెటర్స్ బెస్ట్ అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

భారత జట్టు చెత్త బ్యాటింగ్ పై టీమిండియా ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మీకన్నా స్ట్రీట్ క్రికెటర్స్ బెస్ట్ అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

IND vs SA: 7 మంది డకౌట్.. కోహ్లీ, రోహిత్ లేకుంటే.. స్ట్రీట్ క్రికెట్ ఆడుకోవాలా?

ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటింగ్ లైనప్ టీమిండియా సొంతం. అదీకాక వన్డే వరల్డ్ కప్ 2023 రన్నరప్ కూడా. ఇదే ఊపుతో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీ20 సిరీస్ ను సమం చేసుకుని, వన్డే సిరీస్ ను గెలిచిన భారత జట్టు. అదే ఊపును టెస్టుల్లో కొనసాగించలేక చతికిలపడింది. తాజాగా కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో సఫారీ బౌలర్ల ముందు నిలవలేక ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ (ముకేశ్ కుమార్ సున్నా పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు)గా వెనుదిరిగడం, అదీకాక ఒక్క పరుగు కూడా చేయకుండా ఆరు వికెట్లు నేలకూలడం చరిత్రలో ఫస్ట్ టైమ్. ఈ చెత్త బ్యాటింగ్ పై టీమిండియా ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మీకన్నా స్ట్రీట్ క్రికెటర్స్ బెస్ట్ అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో సఫారీ టీమ్ 55 రన్స్ కే కుప్పకూలింది. ఇది సంతోషమే. కానీ.. ఆ సంతోషాన్ని ఎంతోసేపు ఉంచలేదు ప్రోటీస్ బౌలర్లు. మరోసారి తమ పేస్ బౌలింగ్ తో చెలరేగి టీమిండియాను 153 పరుగులకే ఆలౌట్ చేశారు. అయితే పేస్ పిచ్ లు, సఫారీ బౌలింగ్ బాగుంది కాబట్టి ఇంత తక్కువ రన్స్ చేశారు అనుకోవచ్చు. కానీ ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏడుగురు బ్యాటర్లు సున్నా పరుగులు చేయడం టీమిండియా చరిత్రలోనే ఇదే తొలిసారి.

7 batsman duck out

కాగా.. ఈ అప్రతిష్ట గురించి కొద్దిసేపు పక్కనపెడితే.. ఒక్క పరుగులు చేయకుండానే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది భారత జట్టు. 153 పరుగుల వద్ద 5వ వికెట్ గా వెనుదిరిగాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(8). ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా ఒక్క పరుగు కూడా జట్టు స్కోర్ కు జత చేయకుండానే వెనుదిరిగారు. రవీంద్ర జడేజా, బుమ్రా, విరాట్ కోహ్లీ, సిరాజ్, ప్రసిద్ద్ లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ ఉందని భావిస్తున్న టీమిండియా.. ఈ అపకీర్తిని మూటగట్టుకోవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. దీంతో ఏడుగురు బ్యాటర్లు సున్నా పరుగులు చేయడం ఏంటి? మీ కంటే గల్లీ క్రికెటర్లు నయం అంటూ దారుణంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ 39, కోహ్లీ 46, గిల్ 36 పరుగులు చేశారు. వీరు ముగ్గురు లేకపోతే పరిస్థితి ఏంటి? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీలు లేకపోతే భారత జట్టు గల్లీ క్రికెట్ ఆడుకోవాలా? అంటూ నెటిజన్లు ఓ రేంజ్ ట్రోల్ చేస్తున్నారు. మరి టీమిండియా చెత్త బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి