iDreamPost

ఫేమస్ యూట్యూబర్ కొండ దొర రాజు హోమ్ టూర్!

ఫేమస్ యూట్యూబర్ కొండ దొర రాజు హోమ్ టూర్!

సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద ఎంతగా పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ సోషల్ మీడియా వల్ల సమయం వృథా చేసుకుంటుంటే.. కొందరు మాత్రం వారి జీవితాలకు చక్కని పునాది వేసుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి మాధ్యమాలను తమ టాలెంట్ ని ఈ ప్రపంచానకి చాటి చెప్పేందుకు వినియోగిస్తున్నారు. కుకుంగ్, డాన్స్, రీల్స్, కామెడీ అంటూ ఎన్నో రకాల వీడియోలతో నెటిజన్స్ ని అలరిస్తున్నారు.

ఇలాంటి వీడియోస్ తో వారికి పేరు రావడం మాత్రమే కాదు.. సంపాదన కూడా వస్తోంది. అదే ఒక ఉపాధి మార్గంగా మారిపోతోంది. ఈ మధ్యకాలంలో వ్లాగ్స్ ఎంతో బాగా క్లిక్ అవుతున్నాయి. వారి జీవన విధానం, డైలీ చేసుకునే పనులనే ఒక వ్లాగ్ రూపంలో వివరిస్తూ ఎంతో మంది అభిమానులను, సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు కొండ దొర రాజు.

ఆ ఫేమస్ యూట్యూబర్ కేడీఆర్ ఐడ్రీమ్ మీడియాకి ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అనే విషయాన్ని వెల్లడించాడు. “ఒకరోజు మా బావ హైదరాబాద్ నుంచి వచ్చాడు. నేను మా పొలానికి తీసుకొచ్చాను. అప్పుడు వర్షం పడుతుంటే.. ఇక్కడే ఉన్న జీడి కాయలు కాల్చి ఇచ్చాను. అది చూసి మా బావ మీ జీవితాలే బాగున్నాయి. కాలుష్యం లేదు, చక్కని వాతావరణంలో జీవిస్తున్నారు అని చెప్పాడు. అంతేకాకుండా ఇవన్నీ ఒక వీడియోగా చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయచ్చుగా అని సూచించారు.

మొదట్లో నేను భయ పడ్డాను. నా ముఖం చూసి బ్యాడ్ కామెంట్స్ చేస్తారు.. నేను చేయను అని చెప్పాను. కానీ, ఒక చిన్న వీడియో చేసి అప్ లోడ్ చేద్దాం అని మా బావ చెప్పారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అప్పటి నుంచి నేను వీడియోలు చేయడం ప్రారంభించాను. నాకు పెద్దగా కోరికలు ఏం లేవు.. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి. మూడు పూటలా తినేందుకు తిండి ఉండాలి. ఒక ఇల్లు కట్టుకోవాలి” అంటూ కొండ దొర రాజు చెప్పుకొచ్చాడు. అలాగే వాళ్లు ఎలా జీవిస్తున్నారు? అడవుల్లో ఉండే ప్రమాదాలు ఏంటి? కొండ దొర రాజు ఇల్లు ఎలా ఉంది? అనే విషయాలను కూడా వివరించాడు. పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి