iDreamPost

విషాదం.. ప్రముఖ దర్శకుడు గుండె పోటుతో మృతి

ఈ ఏడాది సినీ, నాటక రంగానికి చెందిన పలువురు మృతి చెందిన సంగతి విదితమే. ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకె అధినేత విజయ్ కాంత్ మరణం మర్చిపోక ముందే.. ఇప్పుడు మరో దర్శకుడు కన్నుమూశారన్న వార్త వచ్చింది.

ఈ ఏడాది సినీ, నాటక రంగానికి చెందిన పలువురు మృతి చెందిన సంగతి విదితమే. ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకె అధినేత విజయ్ కాంత్ మరణం మర్చిపోక ముందే.. ఇప్పుడు మరో దర్శకుడు కన్నుమూశారన్న వార్త వచ్చింది.

విషాదం.. ప్రముఖ దర్శకుడు గుండె పోటుతో మృతి

ఈ ఏడాది సినీ, టీవీ, నాటక రంగానికి  చెందిన అనేక మంది దిగ్గజ నటులను కోల్పోయింది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు సీనియర్ నటీనటులే కాకుండా తారకరత్న వంటి యంగ్ స్టార్స్ కూడా ఈ ఏడాది మరణించారు.టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి, ప్రముఖ సింగర్ వాణి జయరాం, సీనియర్ నటులు చంద్ర మోహన్, శరత్ బాబు, బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు సతీష్ కౌశిక్, తమిళ ప్రముఖ దర్శకుడు, హాస్య నటుడు మనోబాల, కమెడియన్లు మయిల్ స్వామి, బోండా మణి, మలయాళంలో ప్రముఖ సీనియర్ నటులతో.. యంగ్ టీవీ, సినీ ఆర్టిస్టులు మృతి చెందారు. తాజాగా తమిళ నటుడు, డీఎండీకె అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కన్నుమూశారు.

ఇప్పుడు మరో చేదు వార్త సినీ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచేస్తుంది. ప్రముఖ మలయాళ థియేటర్ ఆర్టిస్ట్, దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ మృతి చెందారు. తిరువనంతపురంలో ఓ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో ఆడ్మిట్ అయిన ప్రశాంత్ నారాయణ.. గుండె పోటుతో కన్నుమూశారు. రంగ స్థల నటుడిగా ఎన్నో ప్రసిద్ది రచనలకు ఆయన ప్రాణం పోశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ముఖేష్ లతో కలిసి చాయా ముఖి అనే నాటకాన్ని తెరకెక్కించారు. 30 ఏళ్ల పాటు ఆయన థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగారు. మలయాళ ఇండస్ట్రీ ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన మృతికి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి