iDreamPost

Captain Miller: కెప్టెన్ మిల్లర్ తెలుగు రైట్స్ కొన్న ప్రముఖ నిర్మాణ సంస్థలు

Captain Miller.. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోవడం లేదని గగ్గోలు పెడుతుంటే.. తాము ఈ పండుగకే వచ్చేస్తామని అన్నాయి రెండు తమిళ సినిమాలు. వాటిల్లో ఒకటి ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్. అయితే అనుకోకుండా..

Captain Miller.. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోవడం లేదని గగ్గోలు పెడుతుంటే.. తాము ఈ పండుగకే వచ్చేస్తామని అన్నాయి రెండు తమిళ సినిమాలు. వాటిల్లో ఒకటి ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్. అయితే అనుకోకుండా..

Captain Miller: కెప్టెన్ మిల్లర్ తెలుగు రైట్స్ కొన్న ప్రముఖ నిర్మాణ సంస్థలు

ఈ సంక్రాంతికి తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి విదితమే. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ జనవరి 12న అనగా ఈరోజు విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇక వెంకీ మామా సైంధవ్, నాగార్జున నా సామి రంగా జనవరి 13, 14 తేదీల్లో విడుదల అవుతున్నాయి. ఇక్కడ థియేటర్ల విషయంలో రచ్చ రచ్చ జరిగింది. మహేష్ సినిమాకు నైజాం థియేటర్లను లాక్ చేసేసి అభిమానుల కోపాన్ని చవిచూశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. హనుమాన్‌కు మిగిలిన థియేటర్లు దక్కాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సైంధవ్, నా సామి రంగా సినిమాల పరిస్థితి కూడా అలానే ఉంది. అదే సమయంలో అయలాన్, కెప్టెన్ మిల్లర్ మూవీస్ కూడా తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో విడుదలకు సిద్ధమయ్యాయి.

శివ కార్తీకేయన్ నటించిన అయలాన్ తెలుగు డబ్బింగ్ హక్కులను దిల్ రాజు కొనుగోలు చేశారు. నైజాంతో పాటు ఉత్తరాంధ్ర రైట్స్ కొన్న ఆయన.. గుంటూరు కారం విడుదల రోజే.. ఈ చిత్రాన్ని రిలీజ్  చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే మళ్లీ ఎందుకో వెనక్కు తగ్గాడు. ఇది కూడా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. అలాగే ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా ఈ సంక్రాంతికే రావాల్సి ఉంది. కానీ తెలుగు సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారడంతో ఆగింది. తమిళంలో ఈ మూవీ జనవరి 12న విడుదలై .. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీకి చెందిన ఓ న్యూస్ ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతోంది.

కెప్టెన్ మిల్లర్ తెలుగు హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. ఈ నెలలోనే తెలుగులో విడుదల చేయనుంది. సురేష్ ప్రొడక్షన్ అండ్ ఏషియన్ మూవీస్ ఈ రైట్స్ కొన్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మేరకు సురేష్ ప్రొడక్షన్స్ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తామని పేర్కొన్నాయి సంస్థలు. 3, రఘువీరన్ బీటెక్, తిరు, ఇటీవల తెలుగులో చేసిన సార్ మూవీ ద్వారా ధనుష్ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ మూవీలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించారు. అరుణ్ మాధేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకుడు. మరీ ఈ న్యూస్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి