iDreamPost

నెలకు లక్షల ఆదాయం..క్లారిటీ ఇచ్చిన కుమారి ఆంటీ!

ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్లకు కుమారి పేరు కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆమెను నెటిజన్స్ అంతా అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తుంటారు. ఆమె చేతి వంటకు హైదరాబాద్ లో చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తనకు లక్షల్లో ఆదాయం వస్తుందనే వార్తపై ఆమె స్పందించారు.

ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్లకు కుమారి పేరు కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆమెను నెటిజన్స్ అంతా అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తుంటారు. ఆమె చేతి వంటకు హైదరాబాద్ లో చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తనకు లక్షల్లో ఆదాయం వస్తుందనే వార్తపై ఆమె స్పందించారు.

నెలకు లక్షల ఆదాయం..క్లారిటీ ఇచ్చిన కుమారి ఆంటీ!

హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది…చార్మినార్, హుస్సేన్ సాగర్. అదే ఫుడ్ విషయానికి వస్తే.. ధమ్ బిర్యానీకి భాగ్యనగరం ఎంతో ఫేమస్. అలానే స్ట్రీట్ ఫుడ్ కు కూడా హైదరాబాద్ నగరం పెట్టింది పేరు. రోడ్డు సైడ్ ఫుడ్ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు అయ్యాయి. ఇదే సమయంలో సోషల్ మీడియా యూజర్లకు ‘కుమారి’ అనే పేరు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నెటిజన్లంతా ఆమెను అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆమె బాగా ఫేమస్ అయ్యారు. అలానే ఆమెకు లక్షల్లో ఆదాయం వస్తున్నట్లు ఓ ప్రచారం కూడా చేశారు. అయితే ఈ విషయంపై కుమారి ఆంటీ స్పందించారు. నాకు లక్షలు వస్తున్నాయని అనుకుంటున్నారు.. కానీ అసలు వేరే  అని తన ఆదాయం గురించి ఆంటీ రివీల్ చేశారు.

ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్లకు కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె చేతి వంటకు హైదరాబాద్ లో చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇనార్భిట్ మాల్ సమీపంలో కేబుల్ బ్రిడ్జి దగ్గర్లోని ఐటీసీ కోహినూరు హోటల్ రోడ్డులో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఆవిడ సోషల్ మీడియాలో ఫేమస్ గతకొన్నిరోజులుగా మీమర్స్ పుణ్యమా అని మరింత వైరల్ అవుతోంది. మధ్యాహ్నం గడియారంలో 12 గంటలు కొట్టగానే అక్కడకి జనాలు గుమికూడతారు. కుమారి ఫుడ్ తీసుకుని ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈమె దగ్గర వెజ్, నాన్ వెజ్ రెండురకాల ఫుడ్స్ ఉంటాయి. అయితే వెజ్ కంటే కూడా నాన్ వెజ్ కు చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత అంటే మధ్యాహ్నం 2 గంటలు అయ్యే సరికి అక్కడ నాన్ వెజ్ కూరలు సగానికి సగం అయిపోతాయి.

Kumari Aunty gave clarity on income

ఇదే సమయంలో ఆమెపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు లక్షల్లో ఆదాయం వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. అలానే సోషల్ మీడియాలో సైతం కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కుమారి ఆంటీ స్పందించారు. తనకు లక్షలు వస్తున్నాయని అందరూ అనుకుంటారు. కానీ అందులో వాస్తవం లేదని ఆంటీ ఓ  మీడియాతో మాట్లాడే సందర్భంలో తెలిపారు. అంతేకాక తనకు ఎంత ఆదాయం వస్తుందో కూడ వివరించారు. తనకు లక్షల్లో ఆదాయం వస్తే.. ఇలా రేకుల ఇంట్లో ఎందుకు ఉంటానని, ఇంకా మంచిగా ఉండే దాని కదా అంటూ అమె చెప్పుకొచ్చారు.

తనకు లక్షల్లో ఆదాయం రావట్లేదని, రోజుకి కేవలం రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకే వస్తాయని తెలిపింది. తాను నెంబర్ వన్ క్యాలిటీ వస్తువులనే ఫుడ్ తయారీలో వినియోగిస్తాని ఆమె తెలిపారు. ఉదయం సరకులు తెస్తే.. సాయంత్రానికి వాళ్లకు డబ్బులు ఇచ్చేవాళ్లమని ఆమె తెలిపారు. అలా మొత్తం సాయంత్రానికి అన్ని ఖర్చులు పోను  రోజుకు ఐదువేలు మాత్రమే మిగులుతాయని ఆమె పేర్కొన్నారు. అనవసరం అందరూ తనకు లక్షల్లో ఆదాయం వస్తుందని నెగిటీవ్ వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె బాధ పడ్డారు.

ఈ ట్రోలింగ్, నెగిటివిటీని పక్కన పెడితే ఆవిడను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబ సహకారంతో ఇలాంటి ఒక వ్యాపారం ప్రారంభించడమే కాకుండా.. అందులో విజయం కూడా సాధించారు. జీవితంలో ఇది నిజంగా ఆవిడ సాధించిన సక్సెస్ అనే చెప్పాలి. ఈ విషయం తెలిసిన తర్వాత నెటిజన్స్ కూడా కుమారి మీద, ఆవిడ సక్సెస్ స్టోరీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. కుమారి ఆంటీ తనకు వస్తున్న ఆదాయం గురించి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి