iDreamPost
android-app
ios-app

వేణుస్వామి నోటిదూల.. కోహ్లీకి మంచి పెళ్ళాం ఉంది అంటూ చీప్ కామెంట్స్!

Venu Swamy Comments: ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి క్రికెటర్లను కూడా టచ్ చేయడం వివాదాస్పదంగా మారుతోంది. పైగా చాలా నోటిదురుసు వ్యాఖ్యలు చేశారు.

Venu Swamy Comments: ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి క్రికెటర్లను కూడా టచ్ చేయడం వివాదాస్పదంగా మారుతోంది. పైగా చాలా నోటిదురుసు వ్యాఖ్యలు చేశారు.

వేణుస్వామి నోటిదూల.. కోహ్లీకి మంచి పెళ్ళాం ఉంది అంటూ చీప్ కామెంట్స్!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలిసే ఉంటుంది. ఆయన సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా చలామణి అవుతున్నారు. ఇప్పటికే అడిగినా అడకపోయినా పలువులు సెలబ్రిటీల జాతకాలు లైవ్ లో, వీడియోల్లో చెప్పేస్తూ ఉంటారు. ఇటీవల ప్రభాస్ జాతకం చెప్పడంపై కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఆగ్రహం వ్యక్తం చేయడం చూశాం. వాళ్లు వీళ్లు అని కాదు ఏ సెలబ్రిటీ జాతకం అయినా చెప్పేస్తూ ఉంటారు. తాజాగా ఆయన కొన్ని చీప్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరి మీదనో ఆగ్రహం వెళ్లగక్కడానికి రోహిత్, విరాట్ కోహ్లీ పేర్లను వాడుకున్నారు. అంతేకాకుండా కొంతమందిపై దిగజారుడు వ్యాఖ్యలు కూడా చేశారు.

వేణుస్వామి ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే వ్యాఖ్యలు అలా ఉంటాయి. సెలబ్రిటీలు అడగకపోయినా వారి జాతకాలను వీడియోల్లో చెప్పేస్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఏ సెలబ్రిటీ కపుల్ ఎప్పుడు విడిపోతుంది? ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇలా వాట్ నాట్ అన్నీ చెప్పేస్తారు. అందుకే ఆయన మీద సాధారణంగానే విమర్శలు వస్తాయి. అయితే నెటిజన్స్, తెలుగు రాష్ర్టాల ప్రజలు ట్రోల్ చేసినా పట్టించుకోని వేణుస్వామి తోటి జ్యోతిష్యులు విమర్శించడంతో తీసుకోలేకపోతున్నారు.

Venu swamy

తాజాగా వేణుస్వామి విమర్శించే జ్యోతిష్యులకు వీడియో రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే వాళ్లు వాళ్లు తిట్టుకుంటే ఏముండేది కాదు. కానీ, ఆయన ఉదాహరణల కోసం రోహిత్ శర్మ ప్రదర్శన గురించి, కోహ్లీ భార్య గురించి కామెంట్స్ చేశారు. కోహ్లీకి అనుష్కలాంటి అందమైన భార్య ఉంది కాబట్టే బాగా ఆడుతున్నాడు అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. తాను తిట్టాలి అనుకున్న సో కాల్డ్ జ్యోతిష్యులను తిట్టుకుని ఉంటే ఏముండేది కాదు. ఇలా ఉదాహరణలు చెప్పడం మాత్రమే కాకుండా.. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, కొన్ని ముతక సామెతలు కూడా చెప్పారు. తోటి జ్యోతిష్యూలకు ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు. తనను విమర్శించే హక్కు ఏ జ్యోతిష్యుడికి లేదంటూ కామెంట్స్ చేశారు. తాను చెప్పిన జాతకాల్లో నక్షత్రం తప్పు, జాతకం తప్పు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని చూపించి తనను విమర్శించాలి అన్నారు.

అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతుందని వేణుస్వామి చెప్పాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. తాను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పినట్లు 3 నిమిషాల వీడియో ఉంటే ప్రెస్ క్లబ్ లో బహిరంగంగా క్షమాపణ చెప్తానంటూ కామెంట్స్ చేశారు. అలాగే తాను జ్యోతిష్యం కూడా ఆపేస్తానంటూ చెప్పుకొచ్చార. కొందరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు అన్నారు. వారికి కూడా వేణుస్వామి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అలాగే విమర్శించే జ్యోతిష్యులు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్లపై నోటిదురుసు వ్యాఖ్యలు చేశారు. నాలుగైదు వంశవృక్షాలు, తినేది అన్నమేనా? తాగేది నీళ్లేనా? అంటూ చాలా చీప్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విమర్శించారు అని ట్రిగర్ అయిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. మరి.. వేణస్వామి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişmeritkingjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş