iDreamPost

కరోనా ప్రభావం మీద నిపుణులు ఏమంటున్నారు?

కరోనా ప్రభావం మీద నిపుణులు ఏమంటున్నారు?

కరోనా వ్యాప్తి,కోవిద్ ప్రభావం మీద హిందుస్థాన్ టైమ్స్ లో ప్రచురించ బడిన ప్రవీణ్ చక్రవర్తి చక్కగా రాసిన వ్యాసంలో కోవిద్-19 కి సంబందించిన ప్రధానమైన వాదనలన్నీ చక్కగా వివరించారు.

20 మిలియన్ల మందికి పరీక్షలు నిర్వహించగా 2 1/2 మిలియన్ల గుర్తించబడిన పాజిటివ్ కేసులలో 2 లక్షల లోపు మరణాలు సంభవించిన మీదట ఈ దిగువ పేర్కొనబడిన కొన్ని విషయాలు నిర్దారించబడుతున్నాయి.

1) కరోనా వైరస్ సోకిన వారిలో 1.99% మంది 60 సంవత్సరముల లోపు వయసు కలిగి అంతకు ముందు ఏ వ్యాధి బారిన పడనివారు.

2) ICMR (Indian Council Of Medical Research) వారు గుర్తించిన ప్రకారం 70% వైరస్ సోకిన వారిలో రోగ లక్షణాలు బయట పడడంలేదు. వారు వైరస్ గురించి ఏ మాత్రం గ్రహింపు లేకుండా మామూలు జనంతో పాటు తిరిగి వారికి తెలియకుండానే ఇతరులకు వ్యాప్తి చేస్తున్నారు. అలాగే వారికి తెలియకుండానే ఈ వైరస్ నుంచి స్వస్థత పొందుతున్నారు.

3) బలహీనమైన వ్యక్తులలో కూడా మరణాల రేటు ఊహించినంత అధికంగా లేదు. మిగిలిన సాధారణ వైరస్ ల వల్ల ఎంత శాతం ఉంటుందో ఈ వైరస్ విషయంలో కూడా అలానే ఉంది.

4) సాధారణ నమ్మకానికి భిన్నంగా వాతావరణం వల్ల కానీ, జన్యు పరంగా కానీ భారతీయులకు వ్యాధి నిరోధకత ఎక్కువనే వాదనకు సరైన సాక్షాధారాలేవి లేవు.

స్థూలంగా చెప్పాలంటే భారతీయులలో ఎక్కువ మంది కోవిద్-19 వైరస్ బారిన పడి స్వస్థత కూడా పొందవచ్చు. ఇప్పటి నుంచి కనీసం 18 నెలల పాటు ఈ వైరస్ కు విరుగుడుగా ఎలాంటి వాక్సిను వచ్చే అవకాశం లేదు. అప్పటివరకు లాక్ డౌన్ (బలవంతపు నిర్బంధం) అనేది ఈ సమస్యకు విరుగుడు కాదు, అలానే సాధ్యం కూడా కాదు. జాగ్రత పాటిస్తూ ఈ వైరస్ తో పాటు కలిసి ప్రయాణం చేయడం ఒకటే వాస్తవికమైన మార్గం.

కోవిద్-19 బారి నుంచి భారతదేశం ఇంకా బయట పడలేదు. అలా అని జాగ్రత్తలు పాటించడాన్ని గాలికి వదిలేయలేము. వ్యాపార నియంత్రణలు పాటిస్తూ ఈ వైరస్ ను గురించి అధిక సమాచారం సేకరించి, తగు జాగ్రత్తలు పాటించి, సరికొత్త సాధారణ స్థితికి రావడం, వ్యక్తుల మధ్య దూరం, శుభ్రతలు పాటించడం, ముఖ్యంగా బలహీనులు, వృద్దుల విషయంలో మరింత జాగ్రత పాటించడం మాత్రమే ఇప్పుడు మన ముందున్న సరైన ప్రణాళికగా అగుపిస్తుంది.

…తెలుగు అనువాదం పేపకాయల రామకృష్ణ గారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి