iDreamPost

‘ఇలా అయితే ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పక్కన సీబీఐ స్టేషన్‌ పెట్టాలి’

‘ఇలా అయితే ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పక్కన సీబీఐ స్టేషన్‌ పెట్టాలి’

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై రాష్ట్ర హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ తనదైన శైలిలో స్పందించారు. సుధాకర్‌ ఘటన చిన్న పెట్టి కేసు అని వ్యాఖ్యానించారు. దీనిని సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్రం యావత్తు విస్తుపోయిందన్నారు. కరోనా లేకపోతే ఈ విషయంపై తాను ఆందోళన చేసేవాడినని చెప్పారు.

కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదన్న నియమం ఉందని.. కానీ కోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చినప్పుడు న్యాయ స్థానాలపై నమ్మకం పోతోందని ఆమంచి వ్యాఖ్యానించారు. చిన్న చిన్న కేసులకు కూడా సీబీఐ దర్యాప్తు చేసే పనైతే.. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పక్కన సీబీఐ స్టేషన్‌ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.

కాగా, మత్తు డాక్టర్‌ సుధాకర్‌.. ఇటీవల విశాఖలో మద్యం సేవించి అనుచితంగా ప్రవర్తించడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మానసిక స్థితి సరిగా లేదన్న కారణంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన్ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు దారుణంగా వ్యవహరిచారని, కొట్టారని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత రాసిన లేఖను సుమోటాగా పరిగణించిన కోర్టు విచారణ ప్రారంభించిది. ఈ ఘటనపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తమకు నమ్మకంలేదన్న న్యాయస్థానం… ఈ విషయంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి 8 వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి