iDreamPost

కనగరాజ్ వల్లనే రాజ్ భవన్ లో సిబ్బందికి కరోనా వైరస్ సోకిందంట!!!ఆరోణలలో బాబుతో పోటీపడుతున్న తమ్ముళ్లు

కనగరాజ్ వల్లనే రాజ్ భవన్ లో సిబ్బందికి కరోనా వైరస్ సోకిందంట!!!ఆరోణలలో బాబుతో పోటీపడుతున్న తమ్ముళ్లు

నీకు ప్రాణం కావాలా.. మంత్రి పదవి కావాలా..అని అంటే నాకు మంత్రి పదవే కావాలంటారు ఓ సినిమాలో రాజకీయ నాయకుడైన విలన్. అధికారం, మంత్రి పదవి అంటే తనకు ఎంత మక్కువో ఒక్క డైలాగ్ తో చాటి చెబుతాడు. మాజీ మంత్రి జవహర్ తీరు చూస్తుంటే ఆ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జవహర్ అంతకుముందు ఉపాధ్యాయుడుగా పనిచేశారు. ఆకాశం నుంచి ఊడి పడినట్లు ఒక్కసారిగా మంత్రి పదవి, హోదా రావడంతో ఉబ్బితబ్బిబైపోయారు. ఆ హోదా జీవితాంతం కావాలనే ఆశతో ఉన్నట్లుగా మంత్రి వ్యవహార తీరు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరగడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమంటూ..తక్షణమే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం అధికార దాహంతో ఉన్న మంత్రి జవహర్ ను చూస్తే ఏ మాత్రం ఆశ్చర్యం కలగడం లేదు. బీరు హెల్త్ డ్రింక్ అన్న సదరు మాజీ మంత్రి ఇలాంటి డిమాండ్ చేయడం ఏమాత్రం హాస్యాస్పదంగా లేదు.

నూతన ఎన్నికల అధికారిగా కనగరాజ్ ప్రమాణ స్వీకారం చేయడం వల్ల రాజ్ భవన్ లో సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని మంత్రి జవహర్ మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఆయన తీరు ఎలా ఉందంటే.. మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజ్ భవన్ లో పనిచేసే సిబ్బందికి రాదు.. సామాన్య ప్రజలకు సోకుతుందన్నట్లుగా ఉంది. రాజ్ భవన్ సిబ్బందికి కరోనా వైరస్ వచ్చిందో..రాలేదో..అన్న విషయం పక్కన పెడితే కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం మంత్రి మాజీ మంత్రి జవహర్ కు తెలియదనుకోవాలా..?.  బ్రిటన్ ప్రధాని కి కరోనా సోకింది. బ్రిటన్ యువరాజు కరోనా భయంతో క్వారంటైన్ లో కి వెళ్లారు. స్పెయిన్ యువరాణి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. కెనడా ప్రధాని, ఆయన భార్య ఇద్దరు క్వారంటైన్ లోకి వెళ్లారు. రష్యా ప్రధాని భవన్లోని సిబ్బందికి కరోనా రావడంతో ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇజ్రాయిల్ లో ఆరోగ్య శాఖ మంత్రి ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి.

కరోనా పై వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ వారిని అప్రమత్తం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, ప్రభుత్వంపై పనిగట్టుకుని విమర్శలు చేయాలన్నట్లుగా ఉంది టిడిపి నేతల వ్యవహార శైలి. దక్షిణ భారతదేశంలోనే కరోనా లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటూ వాస్తవ విరుద్ధంగా విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు శైలిని ఆ పార్టీ నేతలు కూడా అందిపుచ్చుకుంటున్నారని మంత్రి జవహర్ ప్రకటనతో అర్థమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి