iDreamPost

వీడియో: యువకుడిని కాపాడి మానవత్వం చాటుకున్న మాజీ సీఎం!

ఈ మద్య చాలా మంది నేతలు తాము ప్రయాణించే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన వారి పట్ల మానవత్వం చాటుకుంటున్నారు. వారిని వెంటనే తమ కాన్వయ్ లో హాస్పిటల్ కి తరలిస్తున్న ఘటనలే ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

ఈ మద్య చాలా మంది నేతలు తాము ప్రయాణించే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన వారి పట్ల మానవత్వం చాటుకుంటున్నారు. వారిని వెంటనే తమ కాన్వయ్ లో హాస్పిటల్ కి తరలిస్తున్న ఘటనలే ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

వీడియో: యువకుడిని కాపాడి మానవత్వం చాటుకున్న మాజీ సీఎం!

ఇటీవల రాజకీయ నేతలు పలు సందర్భాల్లో తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. వారు వెళ్లే మార్గాల్లో ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురై ఆపదలో ఉంటే వాహనాల్లో ఆస్పత్రికి తరలించి.. వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశిస్తున్నారు. అంతేకాదు కొన్నిసార్లు స్వయంగా వారే తమ వాహనాల్లో బాధితులను ఎక్కించుకొని హాస్పిటల్స్ కి తరలిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ దేశ వ్యాప్తంగా జరుగున్నాయి.. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ యువకుడి డివైడర్ ని ఢీ కొట్టి ప్రమాదానికి గురయ్యాడు.. అటుగా వెళ్తున్న సీఎం వెంటనే స్పందించి ఆ యువకుడిని ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని కాపాడారు. భోపాల్ లోని రవీంద్ర భవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. మరో యువకుడు తీవ్రంగా గాపడ్డాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాద ఘటనను గుర్తించి వెంటనే తన కాన్వాయ్ ని ఆపారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని తన కాన్వాయ్ లో హాస్పిటల్ కి తరలించారు. ఆ సమయంలో స్వయంగా యువకుడిని వాహనంలోకి ఎక్కించడంతో ఆయన చేతులకు కూడా రక్తం అంటింది.

ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి యువరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. రవీంద్ర భవన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆ సమయంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అది చూసి నేను ఎంతో ఆందోళన చెందారు.. వెంటనే నా కాన్వాయ్ లో స్వయంగా యువకుడిని హాస్పిటల్ కి తరలించాను. ఆ సమయంలో యువకుడితో పాటు అతని మామ కూడా ఉన్నాడు. యువకుడితో మీరేం చింతించకండి.. మీతో పాటు మీ మామయ్య కూడా ఉన్నారని.. ఆస్పత్రిలో అంతా చూసుకుంటారు అంటూ ధైర్యం చెప్పాను. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శివరాజ్ సింగ్ గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి