iDreamPost

అనామక ఆటగాడి విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ! గేల్ రికార్డు బద్దలు..

టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు అయ్యింది. ప్రత్యర్థి బౌలర్లను సిక్సర్లతో చితక్కొడుతూ.. పెను విధ్వంసం సృష్టించాడు ఓ అనామక ఆటగాడు. ఈ క్రమంలోనే క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టాడు.

టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు అయ్యింది. ప్రత్యర్థి బౌలర్లను సిక్సర్లతో చితక్కొడుతూ.. పెను విధ్వంసం సృష్టించాడు ఓ అనామక ఆటగాడు. ఈ క్రమంలోనే క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టాడు.

అనామక ఆటగాడి విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ! గేల్ రికార్డు బద్దలు..

టీ20 ఫార్మాట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ ఎవరి పేరుమీదుందంటే.. అందరూ క్రిస్ గేల్ పేరే చెబుతారు. ఈ విండీస్ విధ్వంసకర వీరుడు 2013 ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతూ.. పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో 30 బంతుల్లోనే మెరుపు శతకం బాదాడు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్ లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీగా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఈ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టాడు ఓ అనామక ఆటగాడు. ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడుతూ.. ఊచకోత బ్యాటింగ్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షించుకున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు అయ్యింది. సైప్రస్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ సృష్టించిన విధ్వంసం అంతా.. ఇంతా కాదు. సైప్రస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో కేవలం 27 బంతుల్లోనే సాహిల్ శతకం బాదాడు. పురుషులు, మహిళలు, ఇంటర్నేషనల్ ఇలా ఏవిధంగా చూసినా.. పొట్టి క్రికెట్ లో ఇదే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఇక ఇంతకు ముందు ఈ రికార్డు యునివర్సల్ బాస్, విండీస్ వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. అతడు 2013 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడుతూ.. పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో 30 బంతుల్లోనే మెరుపు శతకం బాదాడు. ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేశాడు సాహిల్.

కాగా.. అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ప్లేయర్ జాన్ నికోల్ లాప్టీ ఈ ఏడాది(2024, ఫిబ్రవరి 27)లోనే నేపాల్ పై 33 బంతుల్లో రికార్డ్ సెంచరీ సాధించాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో సాహిల్ సెంచరీకి ముందు ఇదే వేగవంతమైన శతకంగా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు సైతం తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్ ఏకంగా 18 సిక్సర్లు, 6 ఫోర్లతో 144 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అతడి స్ట్రైక్ రేట్ 351 ఉండటం గమనార్హం. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్ లో ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సులు కూడా ఇవే కావడం విశేషం. సాహిల్ సునామీ శతకంతో ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది ఎస్టోనియా టీమ్. మరి ఓ అనామక ఆటాగాడు ఈ రేంజ్ లో ఊహకందని విధ్వంసం సృష్టించి.. గేల్ రికార్డు బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి