iDreamPost

పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ తప్పు చేస్తే రూ.7 లక్షలు నష్టపోతారు!

  • Published Jul 17, 2023 | 10:55 AMUpdated Jul 17, 2023 | 10:55 AM
  • Published Jul 17, 2023 | 10:55 AMUpdated Jul 17, 2023 | 10:55 AM
పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ తప్పు చేస్తే రూ.7 లక్షలు నష్టపోతారు!

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ.. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) ఖాతాదారుల మేలు కోసం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. చందాదారులయిన ఉద్యోగుల సంక్షేమం కోసం.. ఈపీఎఫ్‌ఓ మూడు రకాల స్కీమ్‌లను అమలు చేస్తోంది. దీనిలో మొదటిది ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కాగా.. రెండోది పెన్షన్‌ స్కీమ్‌ 1995(ఈపీఎస్‌).. మూడోది ఎంప్లాయి డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (ఈడీఎల్‌ఐ). ఈ మూడు పథకాల గురించి చందాదారులు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఈ మూడు పథకాల్లో మూడవదైన ఎంప్లాయి డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌(ఈడీఎల్‌ఐ) స్కీమ్‌ చాలా ముఖ్యమైంది. దీనిలో భాగంగా ఎవరైనా ఖాతాదారుడు మరణిస్తే.. ఆ ఉద్యోగి సూచించిన నామినీకి సుమారు 7 లక్షల రూపాయల వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని పూర్తిగా పొందాలంటే.. కొన్ని పనులు చేయాలి. లేదంటే 7 లక్షల రూపాయల మొత్తాన్ని నష్టపోవాల్సి వస్తుంది.

మరి ఈడీఎల్‌ఐ కింద ఉద్యోగి మరణిస్తే.. అతడు సూచించిన నామినీకి 7 లక్షల రూపాయలు రావాలంటే.. సదరు ఉద్యోగి కచ్చితంగా ఇ-నామినేషన్‌ అనేది పూర్తి చేయాలి. లేకపోతే ఈ ప్రయోజనం పొందలేరు. కనుక పీఎఫ్‌ చందాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇ-నామినీ గురించి మర్చిపోవద్దు. 1976లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్‌ రక్షణ కింద ఆర్థిక సాయం అందజేయడం కోసం ఈ ఈడీఎల్‌ఐని ప్రారంభించారు.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952 పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలు డిఫాల్ట్‌గా ఈడీఎల్ఐ ప్రయోజనాల కోసం నమోదు చేసుకుంటాయని నిపుణులు తెలుపుతున్నార. ఫలితంగా పీఎఫ్ చందా చెల్లిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అందుకే ఇ- నామినేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే భారీ నష్టం తప్పదు అంటున్నారు.

ఈపీఎస్, ఈపీఎఫ్ పథకాల్లో భాగంగా ఉద్యోగి తన వేతనం నుంచి కొంత మొత్తాన్ని చెల్లిస్తుండగా.. ఈడీఎల్ఐలో మాత్రం ఉద్యోగి తరపున.. వారు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం చెల్లిస్తుంది. ఈడీఎల్‌ఐ ప్రయోజనాలు పొందాలంటే.. ఉద్యోగులు ఏదైనా కంపెనీలో ఏడాది పాటు తప్పకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏదైనా కంపెనీలో ఏడాది కాలం పూర్తి చేసిన ఉద్యోగులు మాత్రమే ఈ స్కీమ్‌లో లబ్ది పొందేందుకు అర్హులు. అంటే కంపెనీలో చేరిన ఏడాది లోపు ఉద్యోగి మరణిస్తే.. వారు ఈ ప్రయోజనాన్ని పొందలేరు. ఈ స్కీమ్‌కు సంబంధించి మరింత సమచారం కోసం సంబందిత ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

ఒక వేళ ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణించినట్లయితే నామినీలు తప్పనిసరిగా పీఎఫ్, పెన్షన్ విత్ డ్రా, ఈడీఎల్ఐలను క్లెయిమ్ ఫామ్‌ ద్వారా ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అయితే నామినీ తప్పనిసరిగా ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరిగా బ్లాంక్ చెక్‌లు సైతం అందుబాటులో ఉంచుకోవాలి.

ఈడీఎల్ఐ కాలిక్యులేటర్..

ఈడీఎల్‌ఐని ఈ విధంగా లెక్కిస్తారు. ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఉద్యోగి చివరి 12 నెలల సరాసరి వేతనంపై 35 రెట్లు బీమా చెల్లిస్తుంది ఈడీఎల్ఐ. ఉద్యోగి యావరేజ్ మంత్లీ శాలరీ గరిష్ఠంగా రూ. 15 వేలుగా నిర్ణయించారు. అంటే దానికి 35 రెట్లు అంటే 35xరూ.15,000= రూ.5.25 లక్షలు అందుతాయి. దాంతో పాటు ఆర్గనైజే,న్ బోనస్ కింద రూ. 1.75 లక్షలు అందిస్తుంది. అంటే మొత్తంగా రూ. 7 లక్షలు అందుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి